వేమన పద్యాలతో వ్యక్తిత్వ వికాసం
నంద్యాల: యోగి వేమన రచించిన పద్యాలు సమాజానికి నైతిక బోధనను అందించాయని, వాటిని అధ్యయనం చేయడం ద్వారా వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. యోగి వేమన జయంతి సందర్భంగా కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్ హాలులో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ హాజరయ్యారు. యోగి వేమన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..యోగి వేమన పద్యాలు సామాజిక సమానత్వం, మానవతా విలువలు, నిజాయితీ, కష్టపడి జీవించడం వంటి అంశాలను బలంగా ప్రతిపాదిస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ కొల్లా బత్తుల కార్తీక్,జిల్లా రెవెన్యూ అధికారి రాము నాయ క్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో..
జిల్లా పోలీసు కార్యాలయంలో వేమన చిత్రపటానికి పూలమాల వేసి అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు సెల్యూట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేమన తన పద్యాలతో , మానవతా విలువలను చాటిచెప్పారన్నారు. సమాజంలోని మూఢాచారాలను నిర్మూలనకు కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తగా వేమన అని గుర్తుచేశారు. సాయుధ బలగాల డీఎస్పి శ్రీనివాసులు, రిజర్వు ఇన్‌స్పెక్టర్ మంజునాథ్, జిల్లా పోలీస్ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ రాజకుమారి


