అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలి
కర్నూలు: అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాల ని సుప్రీం కోర్టు తీర్మానించిందని, ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీ వరకు మధ్యవర్తిత్వాలను ఎలా అమ లు చేయాలనే విషయమై న్యాయవాదులకు అవగాహ న కల్పిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు కబర్ధి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులకు స్థానిక లీగల్‌సర్వీ సెస్ అథారిటీ కార్యాలయ భవనంలో సోమవారం మధ్యవర్తిత్వంపై 40 గంటల శిక్షణ కార్యక్రమాన్ని కబర్ధి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం హైకోర్టుతో పాటు అన్ని కోర్టుల్లో మధ్యవర్తిత్వం ప్రవేశపెట్టాలని తీర్మానించిందన్నారు. చైన్నె నుంచి వచ్చిన మధ్యవర్తిత్వ శిక్షణ సిబ్బంది రత్నతార, శశిదేవిల పర్యవేక్షణలో న్యాయవాదులకు శిక్షణ ఇస్తు న్నట్లు చెప్పారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి లీలా వెంకటశేషాద్రి మాట్లాడుతూ వివాదాలపరిష్కా రానికి ప్రత్యామ్నాయ మార్గంగా సివిల్ ప్రొసీజర్ కోడ్ లోని సెక్షన్ 89 కింద పరిగణించేదే మధ్యవర్తిత్వమన్నా రు. దీనివల్ల కోర్టులో కేసులు విచారణ వరకు వెళ్లకుండా పరిష్కరించుకోవచ్చన్నారు. శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ వెంకటహరినాథ్, కర్నూలు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు హరినాథ్ చౌదరి, కర్నూలు, నంద్యాల జిల్లాల న్యాయవాదులు కార్యక్రమంలో పాల్గొన్నారు.


