చట్ట పరిధిలో న్యాయం చేస్తాం
నంద్యాల: ఫిర్యాదులపై విచారణ జరిపి చట్టపరిధిలో న్యాయం చేస్తామని జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్‌ఎస్ కార్యక్రమం సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. తన పొలానికి వెళ్లే దారిని మూసివేయడంతో పంటలు వేయలేకపోయానని, చర్యలు తీసుకోవాలని కొలిమిగుండ్ల మండలం కోట పాడు గ్రామానికి చెందిన మూల వెంకటేశ్వరరెడ్డి ఫిర్యాదు చేశారు. తన భర్త ప్రతిరోజూ మద్యం తాగి వచ్చి తనను, తన పిల్లలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని గోవింద పల్లె గ్రామానికి చెందిన రామలక్ష్మమ్మ అర్జీ ఇచ్చా రు. హైదరాబాద్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని రూ.6.60 లక్షలు డబ్బులు తీసుకుని మోసం చేశారని, చర్యలు తీసుకోవాలని నంద్యాల పట్టణానికి చెందిన శ్రీధర్ రావు జిల్లా ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.


