కొనసాగుతున్న నీటి విడుదల
జూపాడుబంగ్లా: పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆదివారం సాయంత్రం ఆరుగంటల ప్రాంతంలో శ్రీశైలం జలాశయంలో 876.80 అడుగుల నీటిమట్టం ఉండగా పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ వద్ద 875.80 అడుగుల నీటిమట్టం నమోదైనట్లు తెలిపారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ గేట్లు మూసివేసి కేవలం ఎన్‌సీఎల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా మాత్రమే రెండు మాసాల నుంచి నీటిని దిగువకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. మూడు జన్‌రేటర్ల ద్వారా 1.7 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తూ 2వేల క్యూసెక్కుల నీటిని ఎన్‌సీఎల్ విద్యుత్ కేంద్రం నుంచి ఎస్సారెమ్సీలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ వ్యవస్థ నుంచి తెలుగుగంగ కాల్వకు 1,500 క్యూసెక్కులు, కేసీఎస్కేప్ కాల్వకు 500 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నట్లు ఏఈ దేవేంద్ర తెలిపారు.


