బండిఆత్మకూరు రైతు సేవా కేంద్రం వద్ద గత శుక్రవారం కనిపిం
కర్నూలు(అగ్రికల్చర్): నంద్యాల జిల్లాకు రావాల్సిన మూడు ర్యాక్‌ల యూరియాను ఇతర జిల్లాలకు మళ్లించారు. దీంతో కొరత తీవ్రమై రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రబీ సీజన్‌లో నీటిపారుదల కింద వరి, మొక్కజొన్న, మినుము తదితర పంటలు సాగు చేశారు. పైరు ఎదుగుదలకు యూరియా అవసరం ఎంతో ఉంది. ఎలాంటి కొరత లేదని అధికారులు ప్రకటనలు ఇస్తున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది. ఒక బస్తా యూరియా కోసం రైతులు ప్రతి రోజూ పోరాటం చేయాల్సి వస్తోంది.
నోరు మెదపని టీడీపీ నేతలు
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి టీడీపీ నేతలు అదనంగా యూరియా తెప్పించాలి. అలా చేయకపోగా వచ్చిన ఎరువులు దారి మళ్లుతున్నా మౌనంగా ఉండిపోయారు. నంద్యాలకు స్పిక్, కోరమాండల్, క్రిఫ్‌కో యూరియా ర్యాక్‌లు వస్తాయని అధికారికంగా సమాచారం వచ్చింది. ఈ ర్యాక్‌లతో 9,500 టన్నుల యూరియా అందుబాటులోకి వస్తుందనుకున్నారు. అయితే వీటిని ఇతర జిల్లాలకు దారి మళ్లించారు. దీంతో బండిఆత్మకూరు, మహానంది, కొలిమిగుండ్ల, కోవెలకుంట్ల తదితర ప్రాంతాల్లో రైతులు ఒక బస్తా యూరియా కోసం రోజుల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది.
అసలైన రైతులకు ఇవ్వకుండా..
యూరియా లేకపోతే పంటలే వేయలేని పరిస్థితి ఏర్పడింది. నంద్యాల మార్క్‌ఫెడ్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా వ్యవసాయ అధికారి ఆదేశాల మేరకు డీసీఎంఎస్‌లు, పీఏసీఎస్‌లు, రైతు సేవా కేంద్రాలకు యూ రియా సరఫరా చేస్తున్నారు. ఈ కేంద్రాలను టీడీపీ నేతలు తమ అధీనంలోకి తీసుకొని ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారు. టీడీపీ కార్యకర్తలైన వారికి మాత్రమే యూరియా ఇచ్చేలా అధికారులపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. నిజమైన రైతులకు వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి ఒక్క బస్తా కూడా ఇవ్వడం లేదు. గోస్పాడు మండలం జిల్లెల్ల గ్రామానికి 532 యూరియా బస్తాలు వచ్చాయి. వీటిని గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయడం విమర్శలకు తావిచ్చింది.
తీవ్ర కొరత
నంద్యాల జిల్లాలో రబీ సాధారణ సాగు 1,75,865 హెక్టార్లు ఉండగా ఇప్పటికే 1,80,312 హెక్టార్లలో సాగైంది. వరి 40,264, మినుము 20569, మొక్కజొన్న 15,442, జొన్న 28,120 హెక్టార్లలో సాగైంది. కలెక్టర్, డీఏవో ఆదేశాల మేరకు మార్క్‌ఫెడ్ నుంచి యూరియా బయటికి వెలుతున్నప్పటికీ సామన్య రైతులకు దక్కడం లేదు. అన్నింటా టీడీపీ నేతలే తిష్ట వేసి టోకన్‌లు ఇవ్వడం సహా మొత్తం వారే చేస్తున్నారు. దీంతో రైతులు ప్రయివేటు దుకాణాల్లో లింక్‌లతో కొనాల్సి వస్తోంది. మార్క్‌ఫెడ్, ఆర్‌ఎస్‌కేలు, ప్రయివేటు డీలర్లు, కంపెనీ గోదాముల్లో 8,000 టన్నుల యూరియా ఉందని అధికారులు చెబుతున్నారు. సాధారణ రైతులకు యూరియా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుచెబుతున్నారు. తాము చెప్పిన వారికే ఇవ్వాలని అధికారులను హెచ్చరిస్తున్నారు. బండిఆత్మకూరు, వెలుగోడు, మహానంది, ఆత్మకూరు, నందికొట్కూరు, శిరిశెళ్ల, కోవెలకుంట్ల, అవుకు మండలాల్లో యూరియా కొరత తీవ్రంగా ఉంది.
దోపిడీ చేస్తూ..
కర్నూలు జిల్లాలో రబీ సీజన్‌లో 75 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. రబీ సీజన్‌కు 24,580 టన్నుల యూరియా అవసరం ఉంది. అయితే 14 వేల టన్నులు మాత్రమే వచ్చింది. ఇటీవల కర్నూలు ర్యాక్‌పాయింట్‌కు కోరమాండల్ కంపెనీకి చెందిన యూరియా 1300 టన్నులు వచ్చింది. ఇందులో 650 టన్నులు మార్క్‌ఫెడ్‌కు, 650 టన్నులు ప్రయివేటు డీలర్లకు కేటాయించారు. కర్నూలు, కోడుమూరు, గూడూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ ప్రాంతాలకు కేటాయించారు. యూరియాను ప్రయివేటు డీలర్లు లింక్‌లు పెట్టి రైతులను దోపిడీ చేస్తున్నారు.
ఇతర జిల్లాలకు మళ్లింపు
ఒక బస్తా కోసం
రైతులకు తప్పని నిరీక్షణ
బయోఫర్టిలైజర్ లింకుతో
దోపిడీ చేస్తున్న డీలర్లు
విక్రయాల్లో టీడీపీ నాయకుల
చేతివాటం
చంద్రబాబు ప్రభుత్వంలో తొలగని
యూరియా కష్టాలు


