‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం
● శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే
శిల్పా చక్రపాణిరెడ్డి
ఆత్మకూరు: రానున్న మున్సిపల్, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుదామని వైఎస్సార్‌సీపీ నాయకులకు, కార్యకర్తలకు శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి పిలుపునిచ్చారు. ఆత్మకూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో గురువారం వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీకి వెన్నుదన్నుగా నిలిచిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తామన్నారు. వారితో గ్రామ, పట్టణ స్థాయి కమిటీలను ఎంపిక చేస్తామన్నారు. పదవులు పొందిన వారు గ్రామ, పట్టణ స్థాయిలో సమర్థవంతంగా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు. రానున్న మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించుకోవాలన్నారు. గ్రామాల్లో పార్టీ సానుభూతిపరులు, అభిమానులను కలుపుకుంటూ కార్యక్రమాల్లో ముందుకు సాగాలన్నారు. చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ కార్యకర్తలు క్రుటలు పన్నే అవకాశం ఉందని, వాటిని తిప్పి కొట్టాలన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ శ్రీశైలం నియోజకవర్గం సీనియర్ నాయకుడు శిల్పా భువనేశ్వర్‌రెడ్డి ప్రసంగించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ, మండలాధ్యక్షులు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, మండల విభాగాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
‘స్థానిక’ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం


