నల్లమలలో పాదయాత్ర నిషేధం
ఆత్మకూరురూరల్: శ్రీశైలం వెళ్లేందుకు పాదయాత్ర కోసం కన్నడిగులు శుక్రవారం వెంకటాపురం వద్దకు చేరుకోగా నాగలూటి ఇన్‌చార్జ్ ఎఫ్‌ఆర్‌వో ప్రణతి నేతృత్వంలో ఉన్న అటవీ సిబ్బంది వారిని నిలిపి వేశారు. రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్ళేలా వారిని ఒప్పించారు.
ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే అనుమతి
బైర్లూటి చెక్ పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి వచ్చిన పాదయాత్రికులకు గురువారం ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటి డైరెక్టర్ విగ్నేష్ అపావ్ అవగాహన కల్పించారు. పెద్ద పులుల అంచనా గురించి, అటవీ మార్గం మూసివేత గురించి వివరించారు. కేవలం ఫిబ్రవరి 8 నుంచి 15 వరకు మాత్రమే పాదయాత్రకు అనుమతి ఉంటుందని చెప్పారు. అనంతరం పాదయాత్రికులను రోడ్డు మార్గం ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు అనుమతించారు.


