నేడు నందివాహనసేవ
సంక్రాంతి రోజు గురువారం స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులు నందివాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ప్రత్యేక పూజలు అనంతరం గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. అలాగే ఆలయ ప్రాంగణంలోని స్వామిఅమ్మవార్ల నిత్యకల్యాణ మండపంలో గంగాపార్వతీ సమేత మల్లికార్జున స్వామిఅమ్మవార్లకు శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించనున్నారు.
● శ్రీగిరిలో వైభవోపేతంగా
సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
● నేడు పార్వతీ సమేత మల్లికార్జునుడికి
కల్యాణోత్సవం
చీకట్లను తరిమేస్తూ.. భోగి భాగ్యాలను ఆహ్వానిస్తూ..
సంస్కృతి, సంప్రదాయ పరిరక్షణలో భాగంగా శ్రీశైల దేవస్థానం బుధవారం వేకువజామున భోగిమంటలు కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వామిఅమ్మవార్లకు ప్రాతఃకాలపూజలు, మహా మంగళహారతులు పూర్తయిన తరువాత ప్రధాన ఆలయ మహాద్వార ఎదురుగా గంగాధర మండపం వద్ద భోగి మంటలు వేశారు. అర్చకస్వాములు, వేదపండితులు లోక కల్యాణాన్ని కాంక్షిస్తూ సంకల్పాన్ని పఠించారు. సంప్రదాయబద్ధంగా పిడకలు, ఎండుగడ్డి, వంట చెరకు వేసి భోగిమంటలు వేశారు. సంక్రాంతి సందర్భంగా వేసే భోగిమంటలకు మన సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. ఈ భోగిమంటలు వేయడం వలన దుష్టపీడలు విరగడై, అమంగళాలు తొలగి, సకల శుభాలు కలుగుతాయని చెప్పబడుతుంది. భోగి పండుగను పురస్కరించుకుని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించింది. ఐదేళ్ల వయస్సు ఉన్న చిన్నారులకు ఈ భోగిపండ్ల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా అర్చకులు, వేదపండితులు సంకల్పాన్ని పఠించి, గణపతిపూజ జరిపారు. అనంతరం షోడశోపచారపూజలు నిర్వహించి రేగిపండ్లను, చిన్న చిన్న చెరకు ముక్కలు, పూలరెక్కలతో కలిపి పిల్లల తలచుట్టూ మూడుసార్లు తిప్పి భోగిపండ్లను పిల్లలపై వేశారు. ఈ భోగిపండ్లు వేయడం వలన పిల్లలకు పీడలు తొలగి, దృష్టిదోషాలు నశించి ఆయురారోగ్యాలు చేకూరుతాయని చెప్పబడుతుంది.
భక్తజనం మధ్య గ్రామోత్సవం
నేడు నందివాహనసేవ
నేడు నందివాహనసేవ
నేడు నందివాహనసేవ
నేడు నందివాహనసేవ
నేడు నందివాహనసేవ


