పేర్లు మార్చిరి.. మూతేసిరి! | - | Sakshi
Sakshi News home page

పేర్లు మార్చిరి.. మూతేసిరి!

Jan 15 2026 8:35 AM | Updated on Jan 15 2026 8:35 AM

పేర్లు మార్చిరి.. మూతేసిరి!

పేర్లు మార్చిరి.. మూతేసిరి!

పేర్లు మార్చిరి.. మూతేసిరి!

రామకృష్ణారెడ్డి: ఓయ్‌.. సుబ్బాడ్డి.. యాడికి పోతుండావు.. చేతిలో సంచి పట్టుకుంటివి.. బేగిరా .. మనోళ్లు వచ్చున్నారు.

అప్పిరెడ్డి: సుబ్బాడ్డి పది రోజులు పాణం బాగ లేక ఆసుపత్రిలో ఉండే.. డీలర్‌ వద్దకు బియ్యం తెచ్చుకుని పోతుండు. చంద్రబాబు వచ్చాక సిస్టమ్‌ మార్సా. ఇప్పుడు రేషన్‌ బియ్యం బండి ఇంటి వద్దకు రాదు. డీలర్‌ వద్దకు పోయి మనమే తెచ్చుకోవాల. అంతేకాదు రేషన్‌ షాపులో కంది బ్యాలు, పిండి, చక్కర అన్నీ ఇప్పుడు ఇవ్వరు. జగన్‌ ఉన్నప్పుడు ఇంటి వద్దకే వచ్చి అన్ని సరుకులు ఇచ్చిరి. ఒక్కొక్క సీఎం ఒక్కో విధంగా పాలన చేచున్నారు.

సంజీవరెడ్డి: రేషన్‌ బండి దేవుడెరుగు... ఆ సచివాలయం, ఆర్‌బీకే, హెల్త్‌ సెంటర్‌ చూస్తే ఎంత గప్పుడు ఇప్పుడు ఎంతో తేడా. ఇప్పుడు ఎప్పుడు తెరుస్తారో.. ముచ్చారో తెలియదబ్బీ. ఏదో సచివాలయం ఉందంటే ఉంది. అందులోని ఉద్యోగులు సరిగా లేరు. ఏ పని కావాలన్నా అప్పుడు గ్రామంలోనే అయిపోయేది. ఇప్పుడు నంద్యాలకు వెళ్లాల్సి వచ్చుంది. రైతు భరోసా కేంద్రంలో జగన్‌ ప్రభుత్వంలో గ్రామంలోనే విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు లభించేవి. ఇప్పుడు దాన్లకు పేర్లు మారిచినప్పటి నుంచి ఎప్పుడూ మూస్తనే ఉంటారు. అప్పుడు ఎరువులు మాత్రం ఇస్తున్నారు.

వెంకటరెడ్డి: చంద్రబాబు తన హయాంలో ఎన్నడూ ఒక్క మెడికల్‌ కాలేజీ కట్టలా. జగన్‌ తెచ్చిన కొత్త మెడికల్‌ కాలేజీలను పీపీపీ.. గీపీపీ అంటా.. ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చేలా ఉన్నాడు. కొత్త మెడికల్‌ కాలేజీలకు డబ్బులు లేవంట కానీ.. ఒక్క రోజు యోగా చేయడానికి రూ.300 కోట్లు మన సీఎం ఖర్చు చేస్తాడు. జగన్‌ మళ్లీ సీఎంగా అయి ఉంటే ఈ పాటికి రాష్ట్రమల్లా కొత్త మెడికల్‌ కాలేజీలు ప్రారంభమయ్యేవి.

సుధాకర్‌రెడ్డి: చదువుకున్న పిల్లలకు నిరుద్యోగ భృతి ఇస్తానని చంద్రబాబు ఎన్నికల ముందు ప్రచారం చేసిఉండ్లా?. ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకొని నిరుద్యోగులకు నెలనెలా రూ.3 వేలు ఇస్తాడనుకుంటే నిరుద్యోగులను మోసం చేశాడు.

సాంబిరెడ్డి: నిరుద్యోగులకే కాదబ్బీ. 18 ఏళ్లు దాటిన ఆడోళ్లందరికీ నెలకు రూ.1,500 ఇస్తామని ఎన్నికల ముందు చంద్రబాబు చెప్పి మహిళలను సైతం మోసం చేశాడు. ఇప్పుడు ఎక్కడ ఆ మాట చంద్రబాబు చెప్పడం లేదు. నెలనెలా రూ.1,500 వస్తాయని మహిళలు ఎంతో ఆశపడ్డారు. చంద్రబాబు కుర్చి ఎక్కి రెండేళ్లు అవుతున్నా ఆడబిడ్డ నిధి ఇవ్వడం లేదు. చంద్రబాబు మాటలు నమ్మి చాలా మంది మోసపోతిరి.

బసివిరెడ్డి: చంద్రబాబు ప్రభుత్వం గురించి చెప్పుకుంటూ పోతే చాలా చెప్పుకోవాల్సి వస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ హామీలు ఏమీ అమలు కావడం లేదు. ఒక్క పింఛన్‌ పెంచడం తప్ప. పింఛన్‌ కూడా 50 ఏళ్లకు ఇస్తామని ఎన్నికల్లో చెప్పి ఒక్కరికి కూడా కొత్త పింఛన్‌ ఇవ్వలేదు.

పాండురంగాపురంలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement