మల్లన్న హుండీ ఆదాయం రూ.3.72కోట్లు
శ్రీశైలం టెంపుల్: శ్రీశైల దేవస్థానంలోని ఉభయ దేవాలయాల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా నగదు రూపంలో రూ.3,72,50,251 లభించినట్లు శ్రీశైల దేవస్థాన కార్యనిర్వహనాధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం శ్రీశైలంలోని చంద్రావతి కల్యాణమండపంలో ఉభయ దేవాలయాల్లోని హుండీలలో 21రోజుల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించారు. అలాగే బంగారం 158గ్రాముల200మిల్లీగ్రాములు, వెండి 11కేజీల460గ్రాములతో పాటు కొంత విదేశీ కరెన్సీ కూడా లభించిందన్నారు. పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, సీసీ కెమెరాల నిఘాలో హుండీల లెక్కింపు చేపట్టారు. ధర్మకర్తల మండలి సభ్యులు ఎ.వి.రమణ, భరద్వాజశర్మ, డీఈఓ ఆర్.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.


