108 .. ముక్కుతూ మూల్గుతూ!
● ఆటో, బైక్ ఢీ.. వ్యక్తికి గాయాలు
● గంట సేపైనా రాని 108 వాహనం
బండిఆత్మకూరు: మండలంలోని సోమవారం పార్నపల్లిలో ఆటో, బైక్ ఢీకొన్న ఘటనతో ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేయగా గంట సేపు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. వెలుగోడు నుంచి నంద్యాల వైపు బైక్‌పై వెళ్తున్న లక్క కేశవ పార్నపల్లి గ్రామంలోని చర్చి వద్దకు రాగానే నంద్యాల నుంచి ఆత్మకూరు వైపు వెళ్తున్న ఆటో వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో కేశవ తలకు గాయమవడంతో పాటు కుడి చేయి, ఎడమ కాలు విరిగింది. దీంతో గ్రామస్తులు 108కి ఫోన్ చేశారు. అయితే గంట సేపైనా వాహనం రాకపోవడంతో క్షతగాత్రుడు నొప్పితో అల్లాడిపోయాడు. ఎట్టకేలకు 108 రావడంతో అతడిని నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.


