దారిలోనే దేవుడు కనిపిస్తాడు
కొత్తపల్లి: దేవుడిని దర్శించుకుందామని బయలు దేరిన భక్తులకు దారిలోనే కనిపిస్తాడు. కొలనుభారతి, సంగ మేశ్వరం క్షేత్రాలు ఉన్న రహదారి గుంతలమయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి క్షేత్రాల సందర్శనకు వచ్చే భక్తులు గతులకు రహదారిని చూసి దేవుడా.. అనుకుంటూ వెళ్తున్నారు. వాహదారుల, ప్రయాణికుల ప్రయాణం సజావుగా సాగలంటే రోడ్లు బాగుండాలి. గుంతల్లేని రహదారులే లక్ష్యమంటూ పాలకులు ప్రచారం చేస్తూ కనీసం ప్రధాన రహదారులను కూడా పట్టించుకోవడం లేదు. రోడ్లన్ని అస్తవ్యస్తంగా మారి ప్రయాణికులకు, వాహనదారులకు ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. ఆత్మకూరు నుంచి సంగమేశ్వరం చేరాలంటే భక్తులు 45 కి.మీలు, ఇదే దారిలో 30 కి.మీలు కొలనుభారతి పుణ్యక్షేత్రం ఉంది. దారంతా గుంతలు, కంకర తేలిన రహదారితో వాహనదారుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈనెల 23వ తేదీన కొలనుభారతి క్షేత్రంలో సరస్వతి దేవి అమ్మ వారి పుట్టినరోజు సందర్భంగా వసంత పంచమి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి రెండు తెలుగు రాష్ట్రాలలోని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వేల సంఖ్యలో భక్తులు వాహనాలు, బస్సులు, ఆటోల్లో చేరుకుంటారు. అలాగే ఆత్మకూరు పట్టణం నుంచి కొత్తపల్లి మండాలని సుమారు 12 గ్రామ పంచాయతీలలోని ప్రజలు ప్రతి నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. ఈ రోడ్డుపై ప్రయాణం చేయాలంటే ప్రాణాలు ఆరచేతిలో పెట్టుకుని వెళ్లాల్సిందే. ఉత్సవాలు సమీపిస్తుండటంతో వెంటనే మరమ్మతులు చేయాల్సిన అవసరం ఉంది.
బావాపురం – నందికుంట గ్రామాల మధ్య భయపెడుతున్న గుంతలు
నందికుంట సమీపంలో
రహదారిపై కంకర తేలిన దృశ్యం
అధ్వానంగా ఆత్మకూరు –
సంగమేశ్వరం రహదారి
45 కి.మీలు నరకయాతన
ప్రధాన క్షేత్రాలు ఉన్నా పట్టించుకోని
అధికారులు
దారిలోనే దేవుడు కనిపిస్తాడు
దారిలోనే దేవుడు కనిపిస్తాడు


