అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
కర్నూలు (టౌన్): సంక్రాంతి వేడుకల్లో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని పోలీసులను డీఐజీ, జిల్లా ఇన్‌చార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజలు కేవల ం సంప్రదాయ క్రీడలు మాత్రమే ఆడాలని సూచించారు. జిల్లా కేంద్రంతో పాటు పట్టణాలు, గ్రామాలు, శివారు ప్రాంతాల్లో ఎక్కడైనా కోడి పందేలు, పేకాట, జూదం, గుండాట ఆడితే కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై డయల్ 112, డయల్ 100కు లేదంటే స్థానికంగా పోలీసు స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.


