మా భూమిలోకి మమ్మల్నే అడుగు పెట్టనివ్వడం లేదు
అడంగల్, పాస్ పుస్తకాల్లో మా పేరు ఉన్నా టీడీపీ నాయకులు బలవంతంగా మా భూమిని ఆక్రమించుకున్నారు. అక్రమంగా మైనింగ్ చేపట్టి కోట్లు ఆర్జిస్తున్నారు. మా భూమిలోకి అడుగు పెట్టాలంటే పెట్టనివ్వకుండా భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. న్యాయపరంగా హైకోర్టుకు వెళ్లాం. మైనింగ్ కార్యకలాపాలను ఆపించి మా భూమిలోకి మమ్మల్ను అడుగు పెట్టనివ్వాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా టీడీపీ నాయకులు లెక్కచేయడం లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఎస్పీని కలిసి సమస్య విన్నవించుకున్నా స్పందించడం లేదు. స్థానిక ఎస్‌ఐ, సీఐ మాట వినడం లేదు. మా బాధ ఇంకెవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. టీడీపీ ప్రభుత్వంలో సామాన్యులను బతకనివ్వడం లేదు.
– రాజాగౌడ్, సుంకేసుల గ్రామం, అవుకు


