హైకోర్టు ఆదేశాలను పట్టించుకోని వైనం
ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం హైకోర్టు ఆదేశాలను ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. పలు విషయాల్లో ఇదే విషయంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా స్పందన కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశాల మేరకు తమ భూమిలోకి వెళ్లేందుకు రక్షణ కల్పించాలని బాధితులు ఎస్‌ఐ, సీఐలను వేడుకున్నా ఫలితం లేకపోయింది. దీంతో పీజీఆర్‌ఎస్‌కు వచ్చి ఎస్పీ సునీల్ షొరాణ్‌కి తమ సమస్యను చెప్పుకున్నా చర్యలు తీసుకోవడం లేదని బాధితులు కన్నీటి పర్యంతమవుతున్నారు. టీడీపీ పాలనలో సామాన్యుడిని బతుకనివ్వరా అంటూ ఆవేదన చెందుతున్నారు. అడంగల్, పాసుపుస్తకం తమ పేరు మీదనే ఉన్నాయని.. మా భూమిలోకి మేం వెళ్లకుండా అడ్డుకునేందుకు టీడీపీ నాయకులకు ఏం హక్కుందని ప్రశ్నిస్తున్నారు.
రైతుల పొలంలో అక్రమంగా మైనింగ్ చేసిన దృశ్యం
సాక్షి, నంద్యాల: అధికారమే అండగా టీడీపీ నాయకులు రెచ్చిపోతున్నారు. రైతుల భూముల్లో అక్రమంగా మైనింగ్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. ఇదేం న్యాయమని ప్రశ్నిస్తే ‘అధికారం మాది.. మమ్మల్ని ఎవరూ ఏం చేయలేరు.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి’ అంటూ దౌర్జన్యానికి దిగుతున్నారు. ఓ మంత్రి అండదండలు పుష్కలంగా ఉండడంతో అటు వైపు చూసేందుకు అధికారులు భయపడుతున్నారు.
అప్పట్లో ప్రణాళిక ఇప్పుడు అమలు
అవుకు మండలం సుంకేసుల గ్రామంలోని సర్వే నంబర్ 325–2ఏ1లో ముప్పగాని గోపాలు, ముప్ప గాని రాజుగౌడ్‌లకు 7.86 ఎకరాల పొలం ఉంది. ఆరుతడి పంటలు వేస్తూ జీవనం సాగించేవారు. ఇద్దరు సోదరుల మధ్య మనస్పర్ధలు రావడంతో రెండేళ్ల పాటు సాగు చేయలేదు. ఇదే అదనుగా భావించి 2016లో టీడీపీ నాయకులు భూమిని కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రచించారు. అక్కడే పనిచేస్తున్న పంచాయతీ కార్యదర్శి సుంకన్నను రంగంలోకి దించారు. తన భార్య జి.కమలమ్మ పేరు మీద నాపరాయి గనుల కోసం లీజుకు దరఖాస్తు చేసుకున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు 2019 ఫిబ్రవరిలో లీజు మంజూరు చేస్తూ అధికారులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(ఎన్‌ఓసీ) మంజూరు చేశారు. ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం మారడంతో పాటు ఐదేళ్ల పాటు టీడీపీ నాయకులు అటువైపు చూడలేదు. అయితే ఈ మధ్యలో రైతులను తమ భూమిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటూ వచ్చా రు. 2024లో మళ్లీ అధికారంలోకి రావడంతో పాటు, వారికి ఓ మంత్రి అండగా నిలచడంతో టీడీపీ మండల నాయకుడు ఉగ్రసేనారెడ్డి రెచ్చిపోయాడు. భూమిలో అక్రమంగా ప్రవేశించి మైనింగ్ చేపట్టాడు. నాపరాయి గనులను తవ్వుకుంటూ రూ. కోట్లలో సంపాదిస్తున్నాడు. బాధితులు హైకోర్టును ఆశ్రయించడంతో మైనింగ్ కార్యకలాపాలు నిషేధిస్తూ గతే డాది అక్టోబర్‌లో ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే పోలీసులు రక్షణ కల్పించి బాధితులను తమ భూమిలోకి వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
అవుకులో ఓ మంత్రి అనుచరుడి
అరాచకం
రైతుల భూములను దౌర్జన్యంగా
లాక్కొంటున్న వైనం
అక్రమంగా మైనింగ్ చేస్తూ
కోట్లు సంపాదిస్తున్న టీడీపీ నాయకుడు
హైకోర్టు ఆదేశాలు బేఖాతర్


