పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి | - | Sakshi
Sakshi News home page

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి

Jan 11 2026 9:45 AM | Updated on Jan 11 2026 9:45 AM

పాండు

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయల విహారం

కోవెలకుంట్ల: పట్టణంలో కొలువైన శ్రీదేవి, భూదేవి సమేత పాండురంగ విఠలేశ్వరస్వామి ని జిల్లా న్యాయమూర్తి అమ్మన రాజ శనివారం దర్శించుకున్నారు. ఆలయం వద్ద ఆయనకు కోవెలకుంట్ల జూనియర్‌ సివిల్‌ కోర్టు ఇన్‌చార్జ్‌ జడ్జి ప్రతిమ, సీఐ హనుమంతునాయక్‌, ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డితో పాటు పలువురు సీనియర్‌ న్యాయవాదులు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు సుదర్శనాచార్యులు, పవనచార్యులు పూర్ణకుంభంతో స్వాగతించారు. జిల్లా జడ్జి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయ విశిష్టతను అడిగి తెలుసుకున్నారు. అనంతరం స్థానిక జూనియర్‌ సివిల్‌ కోర్టును సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు. కోర్టు రికార్డుల నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవాదులు వాసగిరి సాయికృష్ణమూర్తి, బాలమురళీకృష్ణ, ఆరికట్ల మల్లికార్జునరెడ్డి, తిరుపతయ్య, జీఎల్‌నరసింహులు తదితరులు పాల్గొన్నారు.

హంద్రీనీవా పైపులైన్‌కు లీకేజీ

డోన్‌: ఓబులాపురం మెట్ట వద్ద హంద్రీనీవా పైపులైన్‌ లీకేజీతో నీరంతా వృథా అవుతోంది. హంద్రీనీవా నీటిపారుదల శాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించలేదని ఓబులాపురం గ్రామస్తులు తెలిపారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి విధితమే. శుక్రవారం ఈ విషయంపై మాజీ మంత్రి బుగ్గన స్పందిస్తూ టీడీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తున్నా చెరువులను హంద్రీనీవా నీటితో నింపడం లేదని విమర్శించారు. ఈ నేపథ్యంలో అధికారులు శనివారం హడావుడిగా నీటిని నింపే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిసింది. అయితే నీటి సరఫరాలో ఒత్తిడిని తట్టుకోలేక ఓబులాపురం మెట్ట వద్ద పైపులైన్‌ లీకేజీ నీరు వృథాగా పోతోంది.

మంత్రాలయం: భక్తుల జయ జయ ధ్వానాల మధ్య స్వర్ణ రథంపై ప్రహ్లాదరాయలు కొలువై శ్రీమఠం ఆవరణలో విహరించారు. మంత్రాలయ క్షేత్రానికి శనివారం భక్తులు పోటెత్తారు. మూల బృందావనానికి నిత్య పూజలు చేశారు. ముందుగా గ్రామ దేవత మంచాలమ్మ దర్శనం చేసుకున్నారు. రాత్రి శ్రీ మఠం ప్రాంగణంలో మంగళ వాయిద్యాల మధ్య ప్రత్యేకంగా అలంకరించిన బంగారు రథంపై ప్రహ్లాద రాయలు కొలువై భక్తులకు దర్శనమిస్తూ విహరించారు.

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి 
1
1/2

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి 
2
2/2

పాండురంగస్వామి సేవలో జిల్లా న్యాయమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement