సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం
శ్రీశైలంటెంపుల్: శ్రీశైల మహాక్షేత్రంలో సోమవారం నుంచి ఈ నెల 18వ తేదీ వరకు పంచాహ్నికదీక్షతో ఏడురోజుల పాటు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు విశేషంగా వాహన సేవ నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఉభయ దేవాలయాల్లో నిర్వహించే పలు ఆర్జిత సేవలను తాత్కాలికంగా రద్దు చేశారు.
ముఖ్యమైన కార్యక్రమాలు
● 15వ తేదీన మకర సంక్రాంతి రోజున స్వామిఅమ్మవార్లకు బ్రహ్మోత్సవ కల్యాణం
● ఈ నెల 17న ఉదయం యాగపూర్ణాహుతి, కలశోద్వాసన, త్రిశూలస్నానం, సాయంత్రం సదస్యం, నాగవల్లి, ధ్వజావరోహణ
● బ్రహ్మోత్సవాల్లో చివరిరోజై 18న పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవలు
స్వామిఅమ్మవార్లకు విశేష వాహనసేవలు..
12న సంక్రాంతి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, ధ్వజారోహణ, 13న భృంగివాహనసేవ, 14న కై లాసవాహనసేవ, 15న నందివాహనసేవ, బ్రహ్మోత్సవ కల్యాణం, 16న రావణవాహనసేవ, 17న పూర్ణాహుతి, ధ్వజావరోహణ, 18న అశ్వవాహనసేవ, పుష్పోత్సవం, శయనోత్సవం, ఏకాంతసేవ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఆర్జితసేవల నిలుపుదల..
ఉత్సవాల సందర్భంగా సోమవారం నుంచి 18వ తేదీ వరకు ఆర్జిత, ప్రత్యక్ష పరోక్షసేవలైన రుద్రహోమం, మృత్యుంజయ హోమం, శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామికల్యాణం, స్వామిఅమ్మవార్ల కల్యాణం, ఏకాంతసేవ, ఉదయాస్తమానసేవ, ప్రదోషకాలసేవ, ప్రాతఃకాలసేవలు నిలుపుదల చేశారు.
శ్రీశైలంలో రేపటి నుంచి
ఏడు రోజుల పాటు నిర్వహణ
ప్రతిరోజు స్వామిఅమ్మవార్లకు
శాస్త్రోక్తంగా పూజాది క్రతువులు,
వాహనసేవలు


