మరి కొద్దిరోజులు ఎల్లెల్సీకి నీటి సరఫరా
హొళగుంద: తుంగభద్ర దిగువ కాలువ (ఎల్లెల్సీ)కు మరి కొద్ది రోజులు నీటి సరఫరా కొనసాగే అవకాశా లు కనిపిస్తున్నాయి. జలాశయం క్రస్ట్‌గేట్ల ఏర్పాటులో భాగంగా ఖరీఫ్ పంటకు మాత్రమే నీరిచ్చి రబీ పంట కు నీరివ్వలేమని టీబీ బోర్డు అధికారులు ముందుగా నే ప్రకటించారు. జనవరి 10నుంచి నీటి సరఫరా నిలిపి వేస్తున్నట్లు తెలిపారు. అయితే డ్యాంలో ఇంకా 29 టీఎంసీల నీరు నిల్వ ఉండడంతో కర్ణాటక పరిధిలో ఇంకా సాగులో ఉన్న పంటలకు నీటిని అందించేందుకు మరి కొద్ది రోజులు అంటే ఈనెల 20 వరకు సరఫరా కొనసాగించే అవకాశం ఉంది. ప్రస్తుతం డ్యాంలోని 18వ నంబరు గేటును కొత్తగా బిగించారు. మే చివరి నాటికి మొత్తం 33 క్రస్టు గేట్ల ఏర్పాటు పనులు పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం టీబీ డ్యాంలో 1605 అడుగులతో 29 టీఎంిసీల నీరు నిల్వ ఉండగ ఇన్‌ఫ్లో జీరో ఉండి ఔట్‌ఫ్లో రూపంలో 7,886 క్యూసెక్కుల నీరు వివిధ కాలువలకు వదులుతున్నారు. శనివారం ఆంధ్ర కాలువ ప్రారంభ (హన్వాళ్ సెక్షన్) 250 కి.మీ వద్ద 635 క్యూసెక్కుల నీటి సరఫరా జరిగింది.


