క్రీడలతో ఉద్యోగులకు మానసిక ఉల్లాసం
కర్నూలు (టౌన్) : క్రీడ ల్లో పాల్గొనడం వల్ల ఉ ద్యోగుల్లో మానసిక ఒత్తి డి తగ్గి ఉల్లాసంగా ఉంటారని నగరపాలక కమిషనర్ విశ్వనాథ్ అన్నా రు. శనివారం స్థానిక ఎగ్జిబిషన్, కౌన్సిల్ హాల్, ఔట్‌డోర్ స్టేడియం,ఇండోర్ స్టేడియం లలో మున్సిపల్ ఉద్యోగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. పురుష ఉద్యోగులకు క్రికెట్, షటిల్ బ్యాడ్మింటన్, వాలీబాల్, క్యారెమ్స్, చెస్ క్రీడలు, మహిళా ఉద్యోగులకు త్రోబాల్, బ్యా డ్మింటన్, 100 మీటర్ల రన్నింగ్ రేస్, మ్యూజికల్ చైర్స్, టగ్ ఆఫ్ వార్, రంగోలి, షటిల్ బ్యాడ్మింటన్ క్రీడలను నిర్వహించారు. క్రీడలను ప్రారంభించిన కమిషనర్ మాట్లాడుతూ శని, ఆదివారం రెండు రోజులు ఈ క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పా రు. సంక్రాంతి పండుగ నాడు మహిళల కోసం ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని, విజేతలకు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో బహుమతులు అందజేస్తామన్నారు. డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, మేనేజర్ చిన్నరాముడు,కార్యదర్శి నాగరాజు, ఎస్ ఈ రమణమూర్తి, ఎంఈ మనోహార్ రెడ్డి,ప్రజారోగ్య అధికారి డాక్టర్ నాగ ప్రసాద్ పాల్గొన్నారు.


