స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ | - | Sakshi
Sakshi News home page

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ

Jan 11 2026 9:42 AM | Updated on Jan 11 2026 9:42 AM

స్టెమ

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ

● పట్టించుకోని అధికారులు ● సొమ్ము చేసుకుంటున్న అక్రమార్కులు

ఎమ్మిగనూరు రూరల్‌: గుండెపోటు బాధితులకు స్టెమీ ( సెగ్మెంట్‌ ఎలివేషన్‌ మయోకార్డియల్‌ ఇన్ఫారాక్షన్‌ ) ఇంజెక్షన్‌ పనిచేస్తుందని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆదినాగేష్‌ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వాసుపత్రికి గుండెపోటుతో వచ్చిన నాసిర్‌, భాగ్యమ్మకు స్టెమీ ఇంజెక్షన్లు ఇచ్చి ప్రాణాలు కాపాడాదు. ఈ సదర్భంగా డాక్టర్‌ ఆదినాగేష్‌ మాట్లాడుతూ గుండె పోటు వచ్చిన వారికి అత్యవసరంగా స్టెమీ ఇంజెక్షన్‌ ఇస్తే కంట్రోల్‌ చేయవచ్చునని తెలిపారు. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో ఈ ఇంజెక్షన్‌ ఖరీదు రూ. 45 వేలు ఉంటుందని, ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వేస్తున్నామని తెలిపారు.

ఆగని ఇసుక దందా

గోనెగండ్ల: ఇసుక అక్రమ రవాణా ఆగడం లేదు. మండలంలో గంజిహళ్లి హంద్రీనది నుంచి రాత్రీ పగలు తేడా లేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. ఒక ట్రాక్టర్‌ ఇసుక రూ.3నుంచి రూ.5వేలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం చెప్పిన ఉచిత ఇసుక పథకం ఎక్కడా కనిపించడం లేదు. అధికారపార్టీ నాయకుల కనుసన్నల్లోనే ఇసుక దందా జరుగుతుంది. పట్టించుకోవాల్సిన మైనింగ్‌ అధికారులు కూడా చోద్యం చూస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

భూగర్భజలాలపై తీవ్ర ప్రభావం

మండలంలో 20 గ్రామ పంచాయతీలు, 28 గ్రామాలు ఉన్నాయి. మండలంలో గంజిహళ్లి, హెచ్‌. కై రవాడి, పుట్టపాశం, వేముగోడు, తిప్పనూరు గ్రామాల మీదుగా వెళ్లే హంద్రీనదిలో మాత్రమే ఇసుక దొరుకుతుంది. ఆయా గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం హంద్రీనది సమీపంలో బోర్లు వేశారు. ప్రతి రోజు ఇసుకను అక్రమంగా తరలిస్తుండడంతో భూ గర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. దీంతో రానున్న వేసవి కాలంలో తమకు తాగునీటి సమస్య ఎదురువుతుందని హంద్రీతీర గ్రామా ల ప్రజలు వాపోతున్నారు. ఇదిలా ఉంటే గంజిహళ్లి గ్రామం హంద్రీనది నుంచి అక్రమంగా ఇసుక రవాణా విషయం తమ దృష్టికి రాలేద ని, విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని గోనెగండ్ల సీఐ చంద్రబాబు పేర్కొన్నారు.

రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించాలి

కర్నూలు కల్చరల్‌: రచనలు మానవీయ కోణాన్ని ఆవిష్కరించేలా ఉండాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ప్రముఖ కవి జి.ఉమామహేశ్వర్‌ రచించిన ‘అహానికి ఆవల’ కథల పుస్తకావిష్కరణ శనివారం మద్దూరు నగర్‌లోని పింగళి సూరన తెలుగు తోటలో సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షుడు కెంగార మోహన్‌ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయిత్రి వి. ప్రతిమ, కథా రచయితలు వెంకట కృష్ణ, మారుతి, డాక్టర్‌ ఎం. హరికిషన్‌, డాక్టర్‌ వి.పోతన్న, ఇనాయతుల్లా, సుభాషణి పాల్గొని మాట్లాడారు. ఉమామహేశ్వర్‌ రాసిన అహానికి ఆవల కథలు సమాజంలో మార్పును కోరుకుంటాయని, మధ్యతరగతి కుటుంబాల్లో సాగే సున్నితమైన మానవ సంబంధాలు విలువలు ఈ కథల్లో ఉంటాయన్నారు. మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తాయన్నారు. కళ్లముందు కనిపించే జీవితాన్ని కథల్లోకి ఎక్కించే జీవన దృశ్యాల్లాగా మలిచాడన్నారు. కార్యక్రమంలో కవులు, రచయితలు ఎస్‌డీవీ అజీజ్‌, వెంకటేష్‌, డాక్టర్‌ అవిజ వెంకటేశ్వర రెడ్డి, విరసం నాయకులు పాణి, తెలుగు భాషా వికాస ఉద్యం కార్యదర్శి జేఎస్‌ఆర్కే శర్మ, ఆవుల చక్రపాణి యాదవ్‌ పాల్గొన్నారు.

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ 1
1/2

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ 2
2/2

స్టెమీ ఇంజెక్షన్‌తో గుండెపోటు బాధితులకు రక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement