ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం
కర్నూలు (సిటీ): నగర శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం శనివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో ఆ స్కూల్ అధినేత కేజే రెడ్డి, మాంటిస్సోరి విద్యాసంస్థల అధినేత కేఎన్‌వీ రాజశేఖర్, సర్వేపల్లి స్కూల్ కరస్పాండెంట్ శేషన్న, శ్రీలక్ష్మి విద్యాసంస్థల కరస్పాండెంట్ దీక్షిత్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అమలులో ఉన్న విద్యా ప్రణాళిక ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో అమలు చేస్తున్నారన్నారు. ఈ విద్యాబోధన భవిష్యత్తులో విద్యార్థులు రాణించేందుకు చక్కగా దోహదపడుతుందన్నారు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆ స్కూల్ ప్రిన్సిపాల్ జస్మిత్ కౌర్, కోఆర్డినేటర్ గోపిక, స్కూల్ ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
ఘనంగా ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వార్షికోత్సవం


