అట్టహాసంగా జేఎన్‌టీయూఏ క్రీడాపోటీలు
పాణ్యం: ఆర్‌జీఎం ఇంజినీరింగ్ కళాశాలలో శనివారం అట్టహాసంగా జేఎన్‌టీయూఏ క్రీడాపోటీలు ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ పోటీలను జేఎన్‌టీయూఏ ఉపలకులపతి డాక్టర్ హెచ్ సుదర్శన్‌రావు, చెర్మన్ శాంతిరాముడు ప్రారంభించారు. 40 కళాశాలల నుంచి సుమారు 2,200 మంది క్రీడాకారులు పాల్గొనున్నారు. రగ్బీ, ఫుట్‌బాల్, త్రోబాల్, బ్యాట్మింటన్, బాస్కెల్‌బాల్, వాలీబాల్ తదితర క్రీడలు జరగనున్నాయి. అనంతరం వారు మాట్లాడుతూ ఇంజినీరింగ్ విద్యార్థులు క్రీడల్లో రాణించాలన్నారు. క్రీడల ద్వారా క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు అలవడుతాయని చెప్పారు. జేఎన్‌టీయూఏ క్రీడ మండలి కార్యదర్శి నారాయణరెడ్డి విశ్వవిద్యాలయాలరిధిలో క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. విద్యతో పాటు క్రీడలు ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెర్మన్ శాంతిరాముడు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయచంద్రప్రసాద్, ఎండీ శివరామ్, డీన్ అశోక్‌కుమార్, కో–ఆర్డినేటర్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అట్టహాసంగా జేఎన్‌టీయూఏ క్రీడాపోటీలు


