ఎస్సార్బీసీ ఉద్యోగి ఇంట్లో చోరీ
బంగారు, వెండి ఆభరణాలు,
కోవెలకుంట్ల: పట్టణంలోని బనగానపల్లెకు వెళ్లే రహదారిలోని డిగ్రీ కళాశాల సమీపంలో శుక్రవారం అర్థరాత్రి చోరీ జరిగింది. స్థానికులు అందించిన సమాచారం మేరకు.. స్థానిక ఎస్సార్బీసీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న జయరామిరెడ్డి రెండు రోజుల క్రితం కుటుంబ సమేతంగా బెంగుళూరులో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లారు. ఇంటికి తాళం వేయడంతో గుర్తు తెలియని దుండగులు తాళం పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. బీరువాలోని మూడు తులాల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి ఆభరణాలు, రూ. 20 వేలు నగదు అపహరించుకెళ్లారు. శనివారం ఉదయం ఇంటికొచ్చే సరికి తలుపులు తెరిచి ఉండటంతో ఇంట్లోకివెళ్లి చూడగా బీరువాలోని వస్తువులు చిందరవందరగా పడి ఉండటంతో చోరీ జరిగిందని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు క్లూస్‌టీం రంగప్రవేశం చేసి దొంగతనానికి సంబంధించి పలు ఆధారాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు.
నగదు అపహరణ


