విజయ డెయిరీ అధికారులపై అక్రమ కేసులు తగదు
● డీఐజీని కలసిన నంద్యాల జిల్లా
వైఎస్సార్‌సీపీ నేతలు
కర్నూలు: నంద్యాల విజయ డెయిరీ డైరెక్టర్, అధికారులపై అక్రమ కేసులు నమోదు చేయడం తగదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నంద్యాల జిల్లా ముఖ్య నేతలు అన్నారు. పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రామిరెడ్డి, గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి తదితరులతో కూడిన ప్రతినిధి బృందం డీఐజీ కోయ ప్రవీణ్‌ను కలిశారు. కర్నూలు బి.క్యాంప్‌లో ఉన్న ఆయన కార్యాలయంలో డీఐజీని కలసి విజయ డెయిరీలో అక్రమ కేసులు, వేధింపులపై సరైన చర్యలు తీసుకోవాలని వినతిపత్రం సమర్పించారు. పాల డెయిరీలో అధికారులను బెదిరింపులకు గురిచేస్తున్న పరిణామాలపై విచారణ జరిపి తగు న్యాయం చేయాల్సిందిగా కోరగా అందుకు డీఐజీ సానుకూలంగా స్పందించినట్లు నాయకులు తెలిపారు.


