సెలవులకు ఊరికెట్టా వెళ్లేది?
పరుగో.. పరుగు
సంక్రాంతి పండుగ నేపథ్యంలో విద్యా సంస్థలకు శనివారం నుంచి సెలవులు ప్రకటించడంతో హాస్టళ్లలో ఉండే విద్యార్థులు సొంతూర్లకు బయలుదేరారు. వివిధ ప్రాంతాలకు వెళ్లేందుకు శుక్రవారం సాయంత్రం బస్టాండ్‌కు భారీగా చేరుకున్నారు. ఇప్పటికే అరకొర సర్వీసులతో నెట్టుకొస్తున్న ఆర్టీసీ పండుగ వేళ బస్సు సర్వీసుల సంఖ్యను పెంచడటంలో నిర్లక్ష్యం వహించింది. దీంతో విద్యార్థులు బస్సుల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. వచ్చిన బస్సు ఎక్కేందుకు తోపులాట జరగడంతో మహిళలు, విద్యార్థినులు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కర్నూలు


