అమ్మ కడుపు చల్లన..
ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రిలో రికార్డు స్థాయిలో ప్రసవాలు
నార్మల్ డెలివరీలకు ప్రాధాన్యత
రాష్ట్రంలో ప్రథమ స్థానం
నాలుగేళ్లుగా వరుసగా రికార్డు
ఎమ్మిగనూరురూరల్: ప్రజా చైతన్యం.. వైద్యుల సేవాతత్వం వెరసి ఎమ్మిగనూరు ఏరియా అసుపత్రి ఆదర్శంగా నిలుస్తోంది. ‘తల్లి–బిడ్డల సురక్షితం లక్ష్యంతో ఏర్పాటు చేసిన ‘ఆదర్శ కాన్పుల వార్డు’ అత్యుత్తమ ఫలితాలనిస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల ప్రజలతోపాటు సి.బెళగల్, ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల్లోని మెజార్టీ గ్రా మాల ప్రజలకు ఎమ్మిగనూరు వైద్యశాలలో విస్తృత వైద్యసేవలు అందుతున్నాయి. ప్రారంభంలో 30 పడకల ఆసుపత్రిగా ఉన్న 2002లో కమ్యూనిటీ ఆసుపత్రిగా నూతనంగా నిర్మించి పడకలను పెంచారు. ఆతర్వాత గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం రూ. 12.60 కోట్లతో వంద పడకలకు అప్‌గ్రేడ్ చేశారు. ప్రస్తుతం నూతనంగా నిర్మాణం చేసిన వంద పడకల ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో సేవలు అందిస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా ప్రసవాల్లో రాష్ట్ర, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఆధు నిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా వైద్య పరి కరాలు ఏర్పాటు చేయడంతో పాటు ఫిజిషీయన్స్, గైనకాలజిస్టులు, స్టాఫ్ నర్సులను కేటాయించడంతో ఉత్తమ సేవలు అందుతున్నాయి.
రికార్డుల్లో మొదటి స్థానం
ఎమ్మిగనూరు ఏరియా హాస్పిటల్లో వైద్యులు, సిబ్బంది సేవాతత్వం..చురుకుదనం మూలంగా రికార్డుస్థాయిలో కాన్పులు నమోదు అవుతున్నాయి. ముగ్గురు గైనకాలజిస్టులకు అందుబాటులో ఉన్నారు. నెలకు 280 నుంచి 340కి పైగా నార్మల్ డెలివరీలు, సిజేరియన్స్ చేస్తున్నారు. ప్రతిరోజూ గర్భిణులకు స్కానింగ్, రక్తపరీక్షలు, సాధారణ చెకప్‌లు చేస్తున్నారు. రికార్డుస్థాయిలో కాన్పులు చేపట్టి జిల్లాతో పాటు రాష్ట్ర స్థాయిలో వరుసగా నాలుగేళ్లుగా మొదటి స్థానం నిలుస్తోంది. అర్దరాత్రైనా..అత్యవసరమైన కాన్పు కోసం వచ్చే గర్భిణులకు మెరుగైన సేవలందిస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.
స్కానింగ్ పరీక్షల్లో టాప్..
ప్రభుత్వాసుపత్రిలో ప్రధాన మంత్రి సురక్షిత మాతృత్వ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 9వ తేదీన ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, పెద్దకడబూరు, కోసిగి మండలాల నుంచి వచ్చే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. సూపరిండెంట్ డాక్టర్ ఆదినాగేష్ పర్యవేక్షణలో గైనకాలజిస్ట్ డాక్టర్లు సుజితా, ఫాతిమా, హిమబిందులు గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేస్తారు. ప్రతి నెల 9వ తేదీ ఒక్కరోజే 490 నుంచి 500 మందికి పైగానే గర్భిణులకు స్కానింగ్ పరీక్షలు చేసి టాప్‌లో నిలుస్తున్నారు. ఎంత సమయం పట్టినా వచ్చిన వారందరికీ స్కానింగ్ పరీక్షలు చేసి పంపుతున్నారు.
సంవత్సరం సాధారణ డెలివరీ ీసీజిరియన్ మొత్తం
2022-23 2,778 517 3,295
2023-24 2,642 62 2,704
2024-25 3,419 607 4,026
2025-26 (డిసెంబర్) 1,709 553 2,262
అమ్మ కడుపు చల్లన..


