శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్
శ్రీశైలం: శ్రీశైల మహా క్షేత్రంలో వచ్చే నెలలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని పోలీసుల మాక్ డ్రిల్ చేపట్టారు. జిల్లా ఎస్పీ సునీల్ షెరాన్ ఆదేశాల మేరకు విపత్కర పరిస్థితుల్లో భక్తులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శుక్రవారం సాయంత్రం స్థానిక సిద్ధిరామప్ప కాంప్లెక్స్ వద్ద అవగాహన కల్పించారు. రద్దీ సమయంలో తొక్కిసలాట ప్రారంభమైతే ప్రాణాలు ఎలా రక్షించుకోవాలి, ఊపిరాడక అపస్మారక స్థితికి చేరుకుని వ్యక్తికి సీపీఆర్ చేసే విధానాన్ని భక్తులకు కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏదైనా భవంతిలో అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సురక్షితంగా ఎలా బయటపడాలి అనే విషయంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పోలీస్, అగ్నిమాపక, రెవెన్యూ, ఆరోగ్య, ఆర్‌అండ్‌బీ, ఏపీఎస్పీడీసీఎల్ తదితర శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ నిర్వహించారు.
ఎకై ్సజ్ నేరాలపై
కమిషనర్ సమీక్ష
కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై ఆ శాఖ కమిషనర్ చామకూరి శ్రీధర్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ సమీక్షించారు. శుక్రవారం వారు అనంతపురం పర్యటనకు వచ్చిన సందర్భంగా జిల్లా ఎకై ్సజ్ నోడల్ కర్నూలు డిప్యూటీ కమిషనర్ శ్రీదేవి, ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ హనుమంతరావు, జిల్లా ఎకై ్సజ్ అధికారి సుధీర్ బాబు తదితరులు కలిశారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశ భవనంలో వారితో సమావేశమై ఉమ్మడి జిల్లాలో నమోదైన ఎకై ్సజ్ నేరాలపై సమీక్షించినట్లు డీసీ శ్రీదేవి తెలిపారు. నవోదయం 2.0, పొరుగు రాష్ట్రాల మద్యం పూర్తిగా కట్టడికి తీసుకోవలసిన చర్యల సమీక్ష జరిగినట్లు డీసీ తెలిపారు.
సామాజిక సేవా
దృక్పథంతో పని చేయాలి
గోస్పాడు: రక్త కేంద్రాల నిర్వాహకులు సామాజిక సేవా దృక్పథంతో పని చేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నివారణ అధికారి డాక్టర్ శారదబాయి అన్నారు. శుక్రవారం స్థానిక బ్లడ్ బ్యాంకులో రక్త కేంద్రాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రక్త కేంద్రాలు మార్గదర్శకాల ప్రకారం నిర్వహించాలన్నారు. ప్రతి నెల వారి నివేదికలు సకాలంలో ఇవ్వాలని, రక్తదానం శిబిరాలు, రక్తదాతల వివరాలు ఈ– రక్తకోష్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. ఏపీ సాక్స్ రాష్ట్ర కార్యాలయం డిప్యూటీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస వర్మ మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ప్రజలు, సేవాసంస్థలు, యువజన సంఘాల సమన్వయంతో అన్ని ప్రాంతాలలో రక్తదానంపై అవగాహన శిబిరాలు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో బ్లడ్ బ్యాంక్ వైద్యాధికారి డాక్టర్ స్వాతి, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రొగ్రాం మేనేజర్ అలీ హైదర్, గణాంక అధికారి దేవి శంకర్ గౌడ, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి రక్త కేంద్ర కౌన్సిలర్, ప్రైవేట్ రక్త కేంద్రాల వైద్య అధికారులు, సాంకేతిక పర్య వేక్షకులు తదితరులు పాల్గొన్నారు.
శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్
శ్రీశైలంలో పోలీసుల మాక్ డ్రిల్


