నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడాలి
కర్నూలు కల్చరల్: విద్యార్థుల్లో నైపుణ్యాభివృద్ధి మరింత మెరుగుపడేలా విద్యా విధానం ఉండాలని రాయలసీమ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ప్రొఫెస ర్ వి.వెంకట బసవరావు అన్నారు. శుక్రవారం వర్సిటీ కాన్ఫరెన్స్ హాల్‌లో స్కిల్లింగ్ ప్రోగ్రామ్స్ ఫర్ ఇండియన్ క్యాంపసెస్ అనే అంశంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాన్ని వీసీ ప్రారంభించారు. అమెరికాకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రసాద్ మావులూరి మాట్లాడుతూ దేశంలోని వివిధ ఉన్నత విద్యా సంస్థలతో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. విద్యార్థులకు భవిష్యత్‌లో అవసరమైన నైపుణ్యాలను అందించడానికి తమ యూనివర్సిటీ ప్రపంచ వ్యాప్తంగా కృషి చేస్తుందన్నారు. ప్రతి సంవత్సరం విద్యా సంస్థల నుంచి పట్టాలు తీసుకొని బయటకు వస్తున్న విద్యార్థుల్లో 80 శాతం మందికి తగిన నైపుణ్యాలు లేకపోవడంతో ప్రారిశ్రామిక అవసరాలకు తగినంత మంది యువత దొరకడం లేదన్నారు. దీంతో పాటు సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్‌లో కూడా చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారన్నారు. కార్యక్రమంలో వర్సిటీ రెక్టార్ ఆచార్య ఎన్‌టీకే నాయక్, రిజిస్ట్రార్ డాక్టర్ బి.విజయ్‌కుమార్ నాయుడు, వ ర్సిటీ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య సి.విశ్వనాథ రెడ్డి, సీడీసీ డీన్, ఇంజినీరింగ్ కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపా ల్ ఆచార్య పీవీ సుందరానంద్, అకడమిక్ అఫైర్స్ డీన్ ఆచార్య సీవీ కృష్ణారెడ్డి, ఐక్యూసీ డైరెక్టర్ ఆచా ర్య ఆర్. భరత్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


