ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్
శిరివెళ్ల: మందస్తు వైద్య పరీక్షలు చేసుకుంటే క్యాన్సర్‌కు చెక్ పెట్టవచ్చని అసంక్రమిత వ్యాధుల జిల్లా నోడల్ ఆధికారి డాక్టర్ కాంతారావు అన్నారు. గురువారం వీరారెడ్డిపల్లె గ్రామ పంచాయతీలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 18 ఏండ్లు దాటిన వారందరికీ వైద్య సిబ్బంది ఇంటింటికి తిరిగి పరీక్షలు చేస్తారన్నారు. వ్యాధి నిర్ధారణయితే చికిత్స తీసుకుంటే క్యాన్సర్‌ను నివారించవచ్చన్నారు. డాక్టర్ ముఖేష్, సీహెచ్‌ఓ రాంమోహన్‌రెడ్డి, పీహెచ్‌ఎన్ సరస్వతి, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
లీకేజీ సమస్యకు
త్వరలో పరిష్కారం
అవుకు(కొలిమిగుండ్ల): అవుకు రిజర్వాయర్ రివిట్‌మెంట్ లీకేజీ సమస్యకు త్వరలో పరిష్కారం లభించనుందని ఎస్సార్‌బీసీ సీఈ కబీర్ బాషా పేర్కొన్నారు. రిజర్వాయర్ వద్ద జరుగుతున్న ప్లగ్గింగ్ పనులను గురువారం సీఈ సీడీఓ శివకుమార్‌రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు కేధారేశ్వరనాథ్, విజయసారధి, అడ్వైజర్ కృష్ణారావు,ఏ ఈఈ ప్రదీప్, క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండింగ్ ఇంజినీర్లతో పాటు ఎస్సార్బీబీసీ ఎస్‌ఈ శుభకుమార్‌తో కలిసి పరిశీలించారు. రిజర్వాయర్‌లో లీకేజీ పాయింట్‌ను ఇప్పటికే గుర్తించామన్నారు. శుక్రవారం నుంచి అండర్‌వాటర్ కాంక్రీట్ పను లు ప్రారంభమవుతాయని చెప్పారు. పనులు పూర్తి కాగానే రిజర్వాయర్‌లో పూర్తి సామర్థ్యం నీటిని నింపుతామని, రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని సూచించారు. కార్యక్రమంలో మద్రా స్ ఐఐటీ ప్రొఫెసర్ సుబ్బారావు, డీఈఈలు మల్లి ఖార్జున, సుబ్బారావు, సాయికిరణ్, ఏఈఈలు సుధాకర్, రవీంద్రప్రసాద్ పాల్గొన్నారు.
ఆళ్లగడ్డ: ఒకరినొకరు ఇష్టపడి వెళ్లిపోయి, పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించిన ప్రేమజంటను కాపాడేందుకు పోలీసులు సాహసం చేయాల్సి వచ్చింది. ఈ ఘటన గురువారం మండల కేంద్రమైన శిరువెళ్లలో చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు.. శిరివెళ్ల పట్టణానికి చెందిన వేరు వేరు మతాలకు చెందిన యువతీ యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం యువతి ఇంట్లో చెప్పకుండా ప్రియుడితో కలిసి వెళ్లిపోయింది. యువతి కుంటుంబ సభ్యు లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. విచారించిన పోలీసులు యువతి బేతంచర్ల బస్టాండు సమీపంలో ఉన్నట్లు గుర్తించి బుధవా రం రాత్రి నంద్యాలకు తరలించి గురువారం శిరివెళ్ల పోలీస్ స్టేషనకు తీసుకొచ్చారు. ఇరువురి కుటుంబ సభ్యుల ముందు కౌన్సెలింగ్ నిర్వహించగా మేజర్లమైన మేము కచ్చితంగా పెళ్లి చేసుకుంటామని చెప్పారు. దీంతో పోలీసులు మేము ఏమీ చేయలేమని, వారి ఇష్ట్రపకారం నడుచుకోవాలని సూచించారు. విషయం తెలిసిన యువతి తరపు బంధువులు పెద్ద ఎత్తున స్టేషన్‌కు చేరుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పోలీసులు సమయస్ఫూర్తితో యువతిని నంద్యాల హోంకు తరలిస్తామని, మళ్లీ మాట్లాడుదామని చెప్ప వాహనంలో తరలిస్తుండగా రోడ్డు పై అటకాయించారు. గుంపులో నుంచి ఓ ఆకతా యి వాహనంపై రాయి విసరడంతో అందులో ఉన్న ఓ వ్యక్తికి గాయమైనట్లు తెలుస్తోంది. దీంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. అ యినా పోలీసులు ప్రేమ జంటను రహస్య ప్రాంతానికి తరలించడంతో ఊపిరి పీల్చుకున్నారు.
ఫిబ్రవరి 7న
నవోదయ ప్రవేశ పరీక్ష
ఎమ్మిగనూరురూరల్: మండల పరిధిలోని బనవాసి జవహర్ నవోదయ విద్యాలయంలో 9, 11వ తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు హాల్ టికెట్స్ డౌన్‌లోడ్ చేసుకోవాల ని ప్రిన్సిపాల్ ఇ.పద్మావతి గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రవేశ పరీక్ష వచ్చే నెల 7న నిర్వహిస్తామన్నారు. రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్ వర్డ్‌గా పుట్టిన తేదిన ఉపయోగించి హాల్ టిక్కెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు. 9వ తరగతికి https://cbseitms.nic.in/2025/ nvsix, 11వ తరగతికి https://cbseitms.nic.in/ 2025/nvsxi వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలని తెలిపారు.
ముందస్తు పరీక్షలతో క్యాన్సర్‌కు చెక్


