రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం

Jan 9 2026 7:13 AM | Updated on Jan 9 2026 7:13 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం

బేతంచెర్ల: ఆర్‌.కొత్తపల్లె గ్రామ సమీపంలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహా సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుడు మృతి చెందాడు. ఎస్‌ఐ తిరుపాలు తెలిపిన వివరాల మేరకు.. దేవనకొండ మండలం పొట్లపాడు గ్రామానికి చెందిన నరేష్‌ ఆచారి (39) బనగానపల్లె మండలం యనకండ్ల గ్రామంలోని మహా సిమెంట్‌ ఫ్యాక్టరీలో కార్మికునిగా పదేళ్లుగా పని చేస్తూ బనగానపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈక్రమంలో సొంతూరులో పొలం పని చూసుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఆర్‌ కొత్తపల్లె – ఆర్‌ఎస్‌ రంగాపురం గ్రామాల మధ్య రహదారి పక్కన్న నిలిపిన ట్రాక్టర్‌ ట్రాలీని ప్రమాదవశాత్తూ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నరేష్‌ ఆచారిని వాహనదారులు బేతంచెర్ల ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందాడు. మృతునికి భార్య జ్యోతితో పాటు కుమార్తె కోమలి, కుమారుడు అఖిరానందన్‌ ఉన్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తిరుపాలు గురువారం తెలిపారు.

తల్లిదండ్రులు

మందలించారని..

గోనెగండ్ల: పని చేయకుండా ఖాళీగా ఉంటే ఎట్లా అని..తల్లిదండ్రులు మందలించడంతో కుమారు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గోనెగండ్లకు చెందిన ఎరుకల రంగముని, దేవి దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వీరు స్టీల్‌ సామాన్లు వ్యాపారం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. పెద్ద కుమారుడు సతీష్‌కు వివాహమైంది. చిన్న కుమారుడు వీరేంద్ర (19) ఎటువంటి పనిచేయకుండా ఖాళీగా తిరుగుతు న్నాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి వీరేంద్ర స్నేహితులతో కలిసి మద్యం సేవించి రాత్రి ఇంటికి వెళ్లాడు. దీంతో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్తాపానికి గురయ్యాడు. సమీపంలో ఉన్న సోదరుడి ఇంటికెళ్లి అందరూ నిద్రిస్తుండగా ఇంట్లో ఉరేసుకుని మృతి చెందాడు. మృతుడి అన్న సతీష్‌ ఫిర్యాదు మేరకు గురువారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు

గోనెగండ్ల: అక్రమంగా ఇసుక తరలిస్తే కేసులు నమోదు చేయాలని పోలీసులను, రెవెన్యూ అధికారులను రాయలసీమ జోనల్‌ మైనింగ్‌ ఏడీ వెంకటేశ్వర్లు(ఏడీ విజిలెన్స్‌), జిల్లా రాయల్టీ ఇన్స్‌స్పెక్టర్‌ శివ పార్వతి ఆదేశించారు. బుధవారం సాక్షి దినపత్రికలో ‘హంద్రీలో ఇసుక తోడేళ్లు’ అనే శీర్షికన ప్రచురితమైన ఈ కథనానికి మైనింగ్‌ అధికారులు స్పందించారు. తిప్పనూరు, వేముగోడు, పుట్టపాశం గ్రామాల సమీపంలోని హంద్రీనదులను పరిశీలించారు. హంద్రీనదిలో తవ్విన గుంతలు, ఇసుకను పరిశీలించారు. అధికారుల అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ట్రాక్టర్‌ ఢీకొని

యువకుడి మృతి

బనగానపల్లె రూరల్‌: నందివర్గం పోలీసు స్టేషన్‌ పరిధిలోని పలుకూరు గ్రామ సమీపంలో తోడేళ్ల గుట్ట వద్ద ట్రాక్టర్‌ ఢీ కొట్టడంతో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ భూపాలుడు వివరాల మేరకు.. బేతంచర్ల పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన నాగరాజు కుమారుడు లక్ష్మన్న(26) పలుకూరు గ్రామంలో జరుగు మైనింగ్‌ గనుల్లో కూలిగా పని చేస్తున్నారు. ఈ క్రమంలో పలుకూరు అడ్డ రోడ్డు నుంచి గని వద్దకు నడుచుకుంటూ బయల్దేరాడు. అయితే వెనుక వైపు నుంచి పలుకూరు వైపు వేగంగావెళ్తున్న టాక్టర్‌ లక్ష్మన్న ను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ కోలుకోలేక మృతి చెందినట్లు ఎస్‌ఐ భూపాలుడు తెలిపారు. మృతుడి అన్న అమర్నాథ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

తలసీమియా రక్తమార్పిడి కేంద్రం ఏర్పాటు

కర్నూలు(హాస్పిటల్‌): కర్నూలులోని ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆవరణలో గురువారం తలసీమియా బాధితులకు రక్తమార్పిడి కేంద్రం ప్రారంభమైంది. రెడ్‌క్రాస్‌ సొసైటీ జిల్లా చైర్మన్‌ డాక్టర్‌ కేజీ గోవిందరెడ్డి మాట్లాడుతూ తలసీమియా వ్యాధిగ్రస్తులు నిరంతరం రక్తమార్పిడి చేయించుకోవాల్సి ఉంటుందన్నారు. ప్రతి నెలా వంద మందికి పైగా తలసీమియా బాధితులకు రక్తాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ తీసుకున్న రక్తాన్ని ప్రభుత్వ, ఇతర ఆసుపత్రుల్లో ఎక్కి ంచేవారన్నా రు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా రెడ్‌క్రాస్‌ సొసైటీ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన కేంద్రంలోనే రక్తం ఎక్కించే ఏర్పాటు చేశామన్నారు.

రోడ్డు ప్రమాదంలో  కార్మికుడి దుర్మరణం 1
1/3

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో  కార్మికుడి దుర్మరణం 2
2/3

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం

రోడ్డు ప్రమాదంలో  కార్మికుడి దుర్మరణం 3
3/3

రోడ్డు ప్రమాదంలో కార్మికుడి దుర్మరణం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement