విద్యార్థులకు పుస్తకాల పంపిణీ
డోన్/ప్యాపిలి: మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి తనయుడు, వైఎస్సార్‌సీపీ యువనేత బుగ్గన అర్జున్ అమర్నాథ్‌రెడ్డి గురువారం డోన్, ప్యాపిలి ప్రాంతాల్లోని ప్రభుత్వ వసతి గృహాల్లో విద్యార్థులకు నోటు పుస్తకాలు, పెన్నులు, దుప్పట్లను పంపిణీ చేశారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు అందజేసిన కానుకలను బుగ్గన ఆదేశాల మేరకు విద్యార్థులకు అందజేశారు. డోన్‌లోని జ్యోతిరావ్‌పూలే ఆశ్రమ పాఠశాల, ఐటీఐ, బాలికల వసతి గృహాలతో పాటు ప్యాపిలిలోని కేజీబీవీ విద్యార్థులకు ఈ సామగ్రిని పంపిణీ చేశారు. ఆయా కార్యక్రమాల్లో మున్సిపల్ ఛైర్మన్ సప్తశైల రాజేష్, వైఎస్ చర్మన్ జాకీర్ హుసేన్, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి, జెడ్పీటీసీ రాజ్‌కుమార్, పార్టీ నాయకులు శ్రీరాములు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, బొర్రా మల్లికార్జునరెడ్డి పాల్గొన్నారు.


