అభివృద్ధికి మారుపేరు ఎస్వీ సుబ్బారెడ్డి
పత్తికొండ : ఉమ్మడి జిల్లాలో అభివృద్ధికి మారుపేరుగా నిలిచిన పత్తికొండ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ సుబ్బారెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురువారం పత్తికొండ పట్టణంలో పులికొండ గ్రామానికి చెందిన ఎస్వీ అభిమానులు ఎస్వీ సుబ్బారెడ్డి 95 సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగాగా 95 కేజీల కేక్‌తో ఎస్వీ కుటుంబం అభిమానులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున రామచంద్రారెడ్డి, నాగరత్నమ్మ దంపతులు నివాసానికి ఊరేగింపుగా చేరుకున్నారు. వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి, విజయ మనోహరి దంపతులు తదితరులు ఎస్వీ సుబ్బారెడ్డితో కేక్ కట్ చేయించారు. అనంతరం వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన నాయకులు ఎస్వీ సుబ్బారెడ్డిని పూలమాల, శాలువా తో సత్కరించి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి అభిమానాన్ని చాటుకున్నారు.


