● కేసీ కెనాల్‌లో దూకిన యువరైతు
అప్పుల బాధతో..
పాములపాడు: పంటలకు ధర లేక.. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో ఓ యువరైతు మనస్థాపం చెంది కేసీ కెనాల్‌లో దూకాడు. ఈనెల 6వ తేది రాత్రి ఈ సంఘటన జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని జూటూరు గ్రామ పంచాయతీ మజరా కోల్స్ ఆనందాపురం గ్రామానికి చెందిన యువరైతు వంశీ(21) తండ్రి చంద్రపాల్, తల్లి నాగమ్మతో కలిసి వ్యవసాయం చేసేవాడు. రెండేళ్ల నుంచి వ్యవసాయం కలిసి రావడం లేదు.దీనికితోడు 6 ఎకరాలు కౌలుకు తీసుకొని మొక్కజొన్న, మినుము పండిస్తే సరైన ధర లభించలేదు. పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతో చేసిన అప్పులపై ఇంట్లో కుటుంబసభ్యులతో మదనపడ్డాడు. తర్వాత ఇంటికి గొళ్లెం పెట్టి పరుగెత్తుకుంటూ సమీపంలోని కేసీ కెనాల్‌లో దూకాడు. ఈత కూడా రాకపోవడంతో క్షణాల్లో మునిగిపోయాడు. రాత్రి కావడంతో ఆచూకీ లభించలేదు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ తిరుపాలు సిబ్బందితో పాటు, బంధువులు కేసీ కెనాల్ వెంట గాలింపు చేపట్టారు.
చంద్రబాబువి చీకటి ఒప్పందాలు
జూపాడుబంగ్లా: సీఎం చంద్రబాబునాయుడు చీక టి ఒప్పందాలు చేసుకుంటారని, అందులో భాగ మే రాయలసీమ ఎత్తిపోతల పథకం పనుల నిలిపివేత అని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు రమేష్‌బాబు విమర్శించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించేందుకు నేడు సీపీఐ రాష్ట్ర ప్రధా న కార్యదర్శి ఈశ్వ రయ్య, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కె.రామాంజనేయులు, రైతుసంఘం గౌరవ అధ్యక్షుడు రామచంద్ర య్య తదితరులు రానున్నట్లు తెలిపారు. బుధవారం ఆయన జూపాడుబంగ్లాలో విలేకరులతో మాట్లాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు ఆగడంతో ఈ ప్రాంతంలోని రైతాంగం, ప్రజలకు సాగు, తాగునీటి సమస్య తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
కౌతాళం: మండ లంలోని ఎరి గేరి గ్రామంలో బంగారమ్మ దేవరకు వెళ్లి వస్తుండగా ఆటో ఢీకొని తల్లి కొడుకు దుర్మరణం చెందారు. తుంగభద్ర దిగువ కాలువ సమీపంలో బుధవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. ఎరిగేరి గ్రామంలో బుధవారం బంగారమ్మ దేవర జరుగుతుంది. కౌతాళం గ్రామానికి చెందిన రాము..భార్య మహదేవి, కుమారుడు నాగిరెడ్డి, మనవడు అభిరాంతో కలిసి ఆ గ్రామంలో బంధువుల ఇంటికి వెళ్లారు. దేవర ముగించుకుని సాయంత్రం ద్విచక్రవాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. కౌతాళం నుంచి ఎరిగేరి వైపు ఎదురు వస్తున్న ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. మద్యం మత్తులో ఉన్న ఆటో డ్రైవర్ రాంగ్ రూట్‌లో వెళ్లి బలంగా ఢీ కొట్టడంతో ఘటనా స్థలంలోనే మహదేవి(48), నాగిరెడ్డి (28) మృతి చెందారు. మహదేవి చేతిలో ఉన్న మనవడు అభిరాంకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకున్న సీఐ అశోక్‌కుమార్ సంఘ టనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ఆదోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడు నాగిరెడ్డి భార్య శాంతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నాగిరెడ్డికి భార్య శాంతితో పాటు ఇద్దరు మగ పిల్లలు, ఒక కుమార్తె ఉన్నారు.
● కేసీ కెనాల్‌లో దూకిన యువరైతు
● కేసీ కెనాల్‌లో దూకిన యువరైతు


