యాగంటిలో జిల్లా కలెక్టర్ దంపతులు
బనగానపల్లె రూరల్: యాగంటి క్షేత్రంలో శ్రీ ఉమామహేశ్వరస్వామికి జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా దంపతులు గురువారం ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ఆలయ ఈఓ చంద్రుడు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని అందజేశారు. యాగంటిపల్లె గ్రామ ఉపసర్పంచ్ బండి మౌలీశ్వరరెడ్డి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నాటుసారా నివారణకు టోల్‌ఫ్రీ నంబరు 14405
నంద్యాల(న్యూటౌన్): నాటుసారా నివారణకు 14405 టోల్ ఫ్రీ నంబరు ఏర్పాటు చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ తెలిపారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో గురువారం నవోదయం 2.0 కార్యక్రమ పటిష్ట అమలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్‌ఓ మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 3,474 లీటర్ల నాటు సారా సీజ్ చేశామన్నారు. ఎకై ్సజ్ శాఖ వారి తరఫున 198 , పోలీసు సహకారంతో 47 కేసులను నమోదు చేశామన్నారు. ప్రాహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవికుమార్, జిల్లా వ్యవసాయ అధికారి మురళీకృష్ణ, డీఎంహెచ్‌ఓ వెంకటరమణ, డీఈఓ జనార్దన్‌రెడ్డి, డీఎఫ్‌ఓ నాగమునేశ్వరి పాల్గొన్నారు.
ఏపీ ఈసెట్‌లో జిల్లా విద్యార్థుల ప్రతిభ
కర్నూలు సిటీ: ఏపీ ఈసెట్ ఫలితాలను గురువారం అనంతపురం జేఎన్‌టీయూ అధికారులు విడుదల చేశారు. ఫలితాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లా విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కర్నూలు జిల్లాలో 1,261 మంది పరీక్షలకు హాజరుకాగా 1,146 మంది ర్యాంకులు పొందారు. నంద్యాల జిల్లాలో 791 మంది హాజరుకాగా 736 మంది ర్యాంకులు సాధించారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటేషన్ ఇంజినీరింగ్‌లో ఓర్వకల్లు మండలం కేతవరం గ్రామానికి చెందిన దొమ్మల హేమంత్ రెడ్డి రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. అదే విధంగా డోన్ మండలంలోని రామదుర్గం గ్రామానికి చెందిన అప్పల ప్రణీత్ రెడ్డికి 6వ ర్యాంకు వచ్చింది. బీఎస్సీ ఎంపీసీలో నందికొట్కూరు విద్యా నగర్‌కి చెందిన పెరుమళ్ల రాజేష్ 6వ ర్యాంకు, సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో ఎమ్మిగనూరుకి చెందిన కె.రఘు 6వ ర్యాంకు, ఈఈఈలో ఎమ్మిగనూరు ఎన్టీఆర్ కాలనీకి చెందిన మడుగుల అమర్నాథ్ 7వ ర్యాంకు, బనగానపల్లె గొల్లపేటకు చెందిన జి.శ్రీనివాసులు 10వ ర్యాంకు సాధించారు. ఫార్మాసీలో కర్నూలు బుధవారపేట హబీబ్ ముబారక్ నగర్‌కి చెందిన షేక్ ముస్కాన్ 6వ ర్యాంకు, షేక్ తజ్మీన్ 10వ ర్యాంకు సాధించారు.
యాగంటిలో జిల్లా కలెక్టర్ దంపతులు


