నియోజకవర్గాల
పునర్విభజన జరిగితే.. ఉమ్మడి జిల్లాలో 18కి చేరనున్న అసెంబ్లీ సెగ్మెంట్లు
నియోజకవర్గాల సంఖ్య పెరిగితే రాజకీయంగా కొత్త అవకాశాలు రానున్నాయి. ప్రస్తుతం ఒకే నియోజకవర్గంలో ఉన్న కొన్ని ప్రాంతాలు పునర్విభజనలో వేర్వేరు చోట్లకు మారే అవకాశం ఉంటుంది. దీంతో కొత్త రాజకీయ నాయకత్వానికి అవకాశం లభించడంతో పాటు వివిధ పార్టీల్లో టికెట్ల ఆశావహుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఒకే నియోజకవర్గం పరిధిలో రాజకీయంగా పోటీ పడుతున్న నేతలకు కొత్త స్థానాలు ఏర్పడితే తమ అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దక్కనుంది. మండలాలు, గ్రామాల్లో కూడా రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయి.
ఫ 2027 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపట్టే యోచన
ఫ నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి జిల్లాల్లో
రెండేసి స్థానాలు పెరిగే అంచనా
ఫ జిల్లాల పరిధి మారకుండా నియోజకవర్గాల పునర్విభజన
ఫ రాజకీయ సమీకరణాల్లో మార్పులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు లోక్‌సభలో సరైన మద్దుతులేక ఆమోదం పొందలేదు. ఈ బిల్లును మరోసారి పార్లమెంట్ ముందుకు తీసుకొచ్చేందుకు ప్రత్యేక సమావేశం నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన, స్థానాల పెంపుపై రాజకీయ వర్గాల్లో మళ్లీ చర్చ మొదలైంది. 2027 జనాభా లెక్కల ఆధారంగా పునర్విభజన చేపడితే ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం మూడు జిల్లాల పరిధిలో ఉన్న 12 అసెంబ్లీ స్థానాల సంఖ్య మరో ఆరు పెరిగి 18కి చేరవచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి. నల్లగొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలకు అదనంగా రెండేసి స్థానాలు పెరగవచ్చని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇదే జరిగితే జిల్లాల రాజకీయ ముఖచిత్రంతో పాటు భవిష్యత్ ఎన్నికల సమీకరణాలు కూడా మారే
జిల్లా పరిధి మారకుండా పునర్విభజన
నియోజకవర్గాల పునర్విభజనను భౌగోళిక అంశాలు, పరిపాలన సౌలభ్యం పరిగణనలోకి తీసుకొని ఆ జిల్లా పరిధిలోనే నియోజకవర్గాలు, మండలాలు, గ్రామాలు ఉండేలా ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం కొన్ని మండలాలు ఒక జిల్లా పరిధిలో ఉండగా, మరో జిల్లా పరిధిలోని నియోజకవర్గం ఉన్నాయి. రామన్నపేట, చౌటుప్పల్, నారాయణపూర్, శాలిగౌరారం మండలాలే ఇందుకు నిదర్శనం.
తెరపైకి అర్బన్, రూరల్..,
పాత నియోజక వర్గాలు
గతంలో రద్దయిన పాత నియోజక వర్గాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి. ఆరు నియోజక వర్గాలు కొత్తగా ఏర్పడనున్నందున గతంలో రద్దయిన పాత నియోజక వర్గాల పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.
● నల్లగొండ, సూర్యాపేట పట్టణాల్లో అర్బన్, రూరల్ నియోజకవర్గాలు యాదాద్రిలో రామన్నపేట లేదంటే చౌటుప్పల్ ఏర్పాటు చేస్తారన్న చర్చ జరగుతోంది.
● ప్రస్తుతం నల్లగొండ పట్టణంలో 2 లక్షలపైగా జనాభా, 1.43 లక్షల వరకు ఓటర్లున్నారు. నల్లగొండ పట్టణంతో పాటు రూరల్ మండలం కలుపుకుని నల్లగొండ అర్బన్ నియోజక వర్గంగా.. కనగల్, తిప్పర్తి, మాడుగులపల్లి మండలాలను కలుపుకొని నల్లగొండ రూరల్ నియోజక వర్గంగా ఏర్పాటు చేయవచ్చని భావిస్తున్నారు.
● మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌లోని కొన్ని మండలాలలను కలుపుకొని మరో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది.
● సూర్యాపేట నియోజక వర్గంలో సూర్యాపేట టౌన్‌తో పాటు రూరల్ మండలాన్ని కలుపుకొని సూర్యాపేట అర్బన్ నియోజకవర్గ కేంద్రంగా ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. సూర్యాపేట రూరల్ నియోజకవర్గాన్ని ఆత్మకూర్ (ఎస్), చివ్వెంల, పెన్‌పహాడ్, ప్రస్తుతం కోదాడలోని మోతె మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
● ప్రస్తుతం తుంగతుర్తి నియోజవర్గంలోని నాగారం గతంలో నియోజవర్గంగా ఉంది. 1966లో ఆ నియోజకవర్గం రద్దయి, తుంగతుర్తి ఏర్పడింది. ప్రస్తుతం నియోజకవర్గాల పునర్విభజనలో మళ్లీ నాగారం నియోజకవర్గం ఏర్పాటు చేస్తారన్న చర్చ సాగుతోంది. ఇందులో నాగారం, అడ్డగూడూరు, తిరుమలగిరి, అర్వపల్లి మండలాలు కలిపే అవకాశం ఉంది.


