రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు

Nov 14 2026 1:23 AM | Updated on Nov 14 2026 1:23 AM

నల్లగొండ : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆదేశించారు. జాతీయ రహదారులపై ప్రతి 30 కిలోమీటర్లకు ఒక అంబులెన్స్‌, డాక్టర్‌, హెల్పర్‌ అందుబాటులో ఉండేలా చూడాలని సూచించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రోడ్డు భద్రత సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని బ్లాక్‌స్పాట్ల వద్ద ప్రమాదాల నివారణకు ఇంజనీరింగ్‌ మార్పులు చేపట్టాలని, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వైటీపీఎస్‌ సమీపంలో రోడ్డు పనులు వేగంగా పూర్తి చేయాలని, అవసరమైన చోట ఫోర్‌లేన్‌, సిక్స్‌లేన్‌ రహదారుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. నల్లగొండలో డీఈఓ కార్యాలయం నుంచి మిర్యాలగూడ వరకు అవసరమైన రోడ్డు మార్కింగ్‌ చేయాలని ఆదేశించారు. రోడ్డు భద్రత కోసం రవాణా శాఖ రూ.కోటి నిధులు కేటాయించినట్లు ట్రాన్స్‌పోర్ట్‌ డిప్యూటీ కమిషనర్‌ శ్రీవాణి తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ శరత్చంద్ర పవార్‌, డీఆర్‌ఓ దశరథ, జిల్లా అటవీ శాఖ అధికారి రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

వ్యవసాయ రంగ అభివృద్ధికి యువత తోడ్పడాలి

కట్టంగూర్‌ : వ్యవసాయ రంగం అభివృద్ధికి యువత ఆధునిక పరిజ్ఞానం, నూతన ఆలోచనలతో ముందుకు రావాలని నాబార్డు డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేశ్‌ కశ్యప్‌ అన్నారు. కట్టంగూర్‌ మండలంలోని గంగదేవిగూడెంలో కట్టంగూర్‌ ఉత్పత్తిదారుల కంపెనీ లిమిటెడ్‌ను శుక్రవారం ఆయన సందర్శించారు. ఎఫ్‌పీఓ అభివృద్ధి కార్యక్రమాలు, మౌలిక సదుపాయాలు, ఆధునిక వ్యవసాయ పనిముట్లు, నిమ్మ గ్రేడింగ్‌ పరికరాలను పరిశీలించి మాట్లాడారు. 2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశాల సరసన నిలిపేందుకు రైతు ఉత్పత్తిదారుల సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. ఎఫ్‌పీఓ కార్యక్రమాల ద్వారా రైతులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా లబ్ధి చేకూరుతుందన్నారు. కార్యక్రమంలో నాబార్డు చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదయభాస్కర్‌, ఎఫ్‌పీఓ చైర్‌పర్సన్‌ చెవుగోని సైదమ్మ, ఐఆర్‌డీఎస్‌ అధ్యక్షుడు వాడేపల్లి రమేష్‌, సీఈఓ జక్కుల రమేష్‌, మునుగోడు హార్టికల్చర్‌ అధికారి విద్యాసాగర్‌, బయోచార్‌ వ్యవస్థాపకుడు చైతన్య, కార్బన్‌మింట్‌ వ్యవస్థాపకులు వెంకట్‌, స్వచ్చశక్తి సీఈఓ సుధాకర్‌బాబు, పరుశురాములు, అంజయ్య, ధర్మారెడ్డి, శేఖర్‌, రాజు, లింగారెడ్డి ఉన్నారు.

పారదర్శకంగా భూముల రీసర్వే

నిడమనూరు : భూముల రీసర్వేను పారదర్శకంగా నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ అన్నారు. శుక్రవారం నిడమనూరు మండలం శాఖాపురంలో జరుగుతున్న రీసర్వేను ఆయన పరిశీలించి, రైతులతో మాట్లాడారు. రెవెన్యూ అధికారులకు క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న సమస్యలపై చర్చించి, సలహాలు సూచనలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూముల రీసర్వే రైతుల సహకారంతో పారదర్శకంగా నిర్వహించాలన్నారు. భూమి రికార్డుల ఆధారంగా, క్షేత్రస్థాయిలో రైతు కబ్జాలో ఉన్న భూమి వివరాలు నమోదు చేస్తామన్నారు. తేడాలు ఉంటే.. కో రిలేషన్‌ రిజస్టర్‌ ఆధారంగా ఇరువురికి నోటీసులు అందజేసి, వారికి భూమి హక్కులు ఎలా లభించాయి, ఎంత విస్తీర్ణం కబ్జాలో ఉన్నారనే దానిపై పాత రికార్డులు పరిశీలిస్తారన్నారు. కార్యక్రమంలో తహసీల్దారు జంగాల కృష్ణయ్య, అధికారులు రింగు ప్రవీణ్‌కుమార్‌, గుండెబోయిన సైదులు, నజీర్‌, సైదులు, సర్వేయర్‌ రాజశేఖర్‌, సర్పంచ్‌ చేకూరి సూర్యనారాయణ, మార్కెట్‌ మాజీ చైర్మన్‌ సత్యం, రైతులు మోసాల శీను, బొజ్జ లాజీ, గోడవర్తి భాస్కర్‌రావు, రైతులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement