నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో 45వ సౌత్ ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ మహాసభలు అట్టాహాసంగా ప్రారంభమయ్యాయి. మూడురోజుల పాటు జరుగనున్న ఈ సభలకు దక్షిణ భారతదేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన యూనివర్సిటీల ప్రతినిధులు, విద్యార్థులు తరలివచ్చారు. ఆయా రాష్ట్రాల్లోని చరిత్రకారులు, యూనివర్సిటీల ప్రొఫెసర్లు, పరిశోధకులు, విద్యార్థులు పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించారు. గ్రామీణ విశ్వాసాలు, స్థానిక దేవతారాధనలు, ఆదివాసీ, ప్రధాన మత సాంప్రదాయాల మధ్య జరిగిన సమన్వయాన్ని సామాజిక, ఆర్థిక రాజకీయ నేపథ్యానికి సంబంధించిన అంశాలపై వక్తులు కీలకోపన్యాసం చేశారు. వలస పాలన, నాటి అధ్యయనాయాల్లో ప్రతిఫలించిన పక్షపాతాలు, ప్రజల జీవనానుభవాలు, దక్షిణ భారతంలోని ప్రాచీన ఆచారాలు, శాసనాలు, పురావస్తు ఆధారాలు, జానపద సాంప్రదాయాలు, సామాజిక ఉద్యమాలు తదితర వాటి గురించి చేపట్టిన వందల పరిశోధన ల పత్రాలను సమర్పించేందుకు నల్లగొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ వేధిక కావడం ఎంతో గర్వకారణమని ఎంజీ యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ఖాజా ఆల్తాఫ్ హుస్సేన్ తెలిపారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ కె.అర్జునరావు, సదాశివన్, సుభాషిణి, బాలమగురు స్వామి, ఆర్.ఉమ, బీసీ రాయ్, కస్తూరి మిశ్రా, పరమళ ఖడంగ, శ్రీనాథ్, రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి, ప్రిన్సిపాల్ అరుణప్రియ, అసోసియేట్ ప్రొఫెసర్ ప్రశాంతి పాల్గొన్నారు.


