మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రేపటి నుంచి సౌత్‌ ఇండియా హిస్టరీ కాంగ్రెస్‌ | - | Sakshi
Sakshi News home page

మహాత్మాగాంధీ యూనివర్సిటీలో రేపటి నుంచి సౌత్‌ ఇండియా హిస్టరీ కాంగ్రెస్‌

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

పరిశోధకులు, విద్యార్థులు ఒకే చోటుకు.. తెలంగాణ చారిత్రక పరిశోధనకు ప్రాధాన్యం అకడమిక్‌ సహకారానికి ప్రోత్సాహం 750 పరిశోధన పత్రాల రిజిస్ట్రేషన్‌

న్యూస్‌రీల్‌

1978లో ప్రారంభమైన చరిత్ర కాంగ్రెస్‌

విభాగాల వారీగా అధ్యక్షులు వీరే..

గురువారం శ్రీ 12 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

- 8లో

సాక్షి ప్రతినిధి నల్లగొండ : దేశంలో చరిత్ర పరిశోధన రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ (ఎస్‌ఐహెచ్‌సీ) నిర్వహణకు నల్లగొండ వేదిక కానుంది. మహాత్మాగాంధీ యూనివర్సిటీలో (ఎంజీయూ)లో ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు 45వ వార్షిక సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ జరగనుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఈ జాతీయస్థాయి సదస్సును నిర్వహించనున్నారు. ఈ సదస్సుకు వివిధ రాష్ట్రాల నుంచి 1200 మంది వరకు పరిశోధకులు, చరిత్రకారులు హాజరు కానున్నారు. యూనివర్సిటీ చరిత్ర, పర్యాటక శాఖ ఆధ్వర్యంలోని యూనివర్సిటీ కాలేజ్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌ నేతృత్వంలో ఈ సదస్సు జరుగనుంది. ఈ సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ సదస్సు ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ బాలకిష్టారెడ్డి హాజరుకానున్నారు.

భారతదేశ చరిత్రపై అధ్యయనం చేస్తున్న ప్రముఖ చరిత్రకారులు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులను ఒకే వేదికపైకి తీసుకురావడమే ఈ సదస్సు ప్రధాన ఉద్దేశం. వివిధ రాష్ట్రాలకు చెందిన పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించడంతో పాటు భారత చరిత్రకు సంబంధించి తాజా పరిశోధనలు, నూతన అధ్యయన పద్ధతులపై చర్చించనున్నారు. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మత చరిత్రతో పాటు చరిత్ర రచన– సముద్ర చరిత్ర, అణగారిన వర్గాల చరిత్ర వంటి విభిన్న అంశాలు సదస్సులో చర్చకు రానున్నాయి. విదేశీ ప్రతినిధుల కోసం ఆన్‌లైన్‌ పరిశోధనా పత్రాల ప్రదర్శన వంటి అంశాలపై ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు.

చారిత్రక ఆలయాలు, కోటలు, పురాతన కట్టడాలు, స్వాతంత్య్ర పోరాటం, సామాజిక ఉద్యమాలు, సాంస్కృతిక సంప్రదాయాలకు నిలయమైన నల్లగొండ జిల్లా ఈ సదస్సుకు వేదిక కావడం ప్రత్యేకతను సంతరించుకుంది. నాగార్జునసాగర్‌ వంటి సాగునీటి ప్రాజెక్టులు, వ్యవసాయం, పారిశ్రామిక అభివృద్ధి, విద్యారంగంలో జిల్లా ప్రస్థానం కూడా చారిత్రక అధ్యయనానికి విస్తృత అవకాశాలను అందిస్తున్నాయి. దక్షిణ భారతదేశ చరిత్రతో పాటు తెలంగాణ ప్రాంత చరిత్ర, వారసత్వ సంపద, సామాజిక పరిణామాలపై మరింత పరిశోధనకు ఈ సదస్సు దోహదపడనుంది. తెలంగాణ చరిత్రకు సంబంధించిన అంశాలను ఈ వేదికలో పరిచయం చేసేందుకు అవకాశం ఉండనుంది.

సీనియర్‌ చరిత్రకారులు, నూతన పరిశోధకుల మధ్య పరస్పర ఆలోచనల మార్పిడీకి సదస్సు అవకాశం కల్పించనుంది. చరిత్ర అధ్యయనంలో ఆధునిక పరిశోధనా పద్ధతులు, పరిశోధనలు, అణ గారిన వర్గాల చరిత్రకు ప్రాధాన్యం కల్పించడం, దక్షిణ భారతదేశ చరిత్రను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరింత విస్త్తృతంగా పరిచయం చేయడం ఈ సమావేశం ప్రధాన లక్ష్యాలు.

సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌లో సమర్పించేందుకు ఇప్పటివరకు 750 పరిశోధన పత్రాలను పరిశోధకులు రిజిస్టర్‌ చేయించుకున్నారు. ప్రత్యక్షంగా హాజరు కాలేని వారు ఆన్‌లైన్‌లోనూ తమ పరిశోధన పత్రాలను సమర్పించేలా ఆన్‌లైన్‌ సెషన్‌ కూడా ఏర్పాటు చేశాం. ఏడు వేర్వేరు సెషన్స్‌లో పేపర్ల ప్రజెంటేషన్‌, చర్చ ఉంటుంది.

– ప్రొఫెసర్‌ అంజిరెడ్డి,రిజిస్ట్రార్‌, ఎంజీయూ

ఫ తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో మొదటిసారి నిర్వహణ

ఫ వివిధ రాష్ట్రాల నుంచి హాజరు కానున్న పరిశోధకులు, చరిత్రకారులు

ఫ మూడు రోజులపాటు చరిత్రపై మేధోమథనం

సౌత్‌ ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ 1978 డిసెంబర్‌ 2న మధురై కామరాజ్‌ యూనివర్సిటీలో ప్రారంభమైంది. ప్రొఫెసర్‌ కెకె.పిళ్లై తొలి అధ్యక్షుడిగా, ప్రొఫెసర్‌ కె.రాజయ్యన్‌ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా వ్యవహరించారు. 1979లో సొసైటీస్‌ యాక్ట్‌ కింద మధురైలో ఈ సంస్థ రిజిస్టర్‌ అయింది. 1980 ఫిబ్రవరిలో మధురై కామరాజ్‌ యూనివర్సిటీ ప్రాంగణంలో తొలి వార్షిక సదస్సు జరిగింది. అప్పటి నుంచి దక్షిణ భారతదేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఏటా వార్షిక సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో 45వ వార్షిక సదస్సుకు నల్లగొండ ఆతిథ్యమివ్వడం విశేషం.

సదస్సులో వివిధ అంశాలపై జరిగే చర్చలకు ప్రముఖ విద్యావేత్తలు, చరిత్రకారులను సెక్షనల్‌ ప్రెసిడెంట్లుగా నియమించారు. రాజకీయ చరిత్ర – డాక్టర్‌ జి.రంగరాజు (చెంగల్పట్టు), సామాజిక చరిత్ర – డాక్టర్‌ సఖారియాటి (తిరువనంతపురం), ఆర్థిక చరిత్ర – ప్రొఫెసర్‌ గజుల దయాకర్‌ (హైదరాబాద్‌), సాంస్కృతిక చరిత్ర – డాక్టర్‌ గోవిందు సురేంద్ర (గూడూరు), చరిత్ర రచనా విధానం, సముద్ర చరిత్ర – డాక్టర్‌ పి.చార్లెస్‌ క్రిస్టోఫర్‌రాజ్‌ (పుదుచ్చేరి), అణగారిన వర్గాల చరిత్ర – ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ వడ్డానం (హైదరాబాద్‌), డిజిటల్‌, ఆన్‌లైన్‌ ప్రదర్శనలు – డాక్టర్‌ ఎస్‌.వేణుమోహన్‌, (కేరళ విశ్వవిద్యాలయం).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement