ఎన్యుమరేషన్‌ ఫారాలు సేకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్యుమరేషన్‌ ఫారాలు సేకరించాలి

Nov 12 2026 3:24 AM | Updated on Nov 12 2026 3:24 AM

నల్లగొండ : ఎన్యూమరేషన్‌ ఫారాల సేకరణ పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మొత్తం 1,58,630 ఎన్యుమరేషన్‌ ఫారాలు సేకరించాల్సి ఉందని.. 32 వేల మంది ఓటర్లు మరణించినట్లు, 1.44 లక్షల మంది శాశ్వతంగా చిరునామా మారినట్లు, 18 వేల మంది ఇప్పటికే మరోచోట ఓటర్లుగా నమోదైనట్లు గుర్తించామన్నారు. మరో 6,978 మంది గైర్హాజరు ఓటర్లు కాగా, 182 మంది ఇతర కేటగిరీకి చెందినవారిగా ఉన్నారని తెలిపారు. శాశ్వతంగా చిరునామా మారినవారు, గైర్హాజరు ఓటర్లు మాత్రమే ఈ నెల 20లోగా ఎన్నికల సంఘం నిర్దేశించిన ఫారంలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. వరంగల్‌ – ఖమ్మం – నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఫారం–18 ద్వారా ఓటు నమోదును ఈ నెల 25 నుంచి డిసెంబర్‌ 10 వరకు నిర్వహించే అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ సమయంలో, డిసెంబర్‌ 30 తర్వాత కూడా అవకాశం ఉంటుందని తెలిపారు. సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌, నాయకులు ముంతాజ్‌, లింగస్వామి, నర్సిరెడ్డి, పిచ్చయ్య, అన్సారీ, సూపరింటెండెంట్‌ కృష్ణమూర్తి, డీటీ సందీప్‌ పాల్గొన్నారు.

భూముల రీ సర్వే పూర్తి చేయాలి

డిసెంబర్‌ మొదటి వారంలోగా భూముల రీ సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిర్వహించిన వీడియో కాన్పరెన్స్‌లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రామాణిక నిర్వహణ విధానం (ఎస్‌ఓపీ) ప్రకారం సర్వే చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా రీ సర్వే నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అటవీ భూములకు సంబంధించిన సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించాలని, 22–ఏ భూముల విషయంలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్‌ జె.శ్రీనివాస్‌, ఆర్డీఓలు వై.అశోక్‌రెడ్డి, శ్రీదేవి, రమణారెడ్డి, వనజారాణి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ దేవరాజ్‌ పాల్గొన్నారు.

కలెక్టర్‌ చంద్రశేఖర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement