నకిరేకల్ (చిట్యాల) : కొనుగోలు కేంద్రానికి రైతులు తీసుకువచ్చిన ధాన్యం మొలకెత్తుతోంది. కేంద్రంలో ధాన్యం పోసి నెల రోజులవుతున్నా.. కొనుగోళ్ల మొదలు కాలేదని చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో రైతులు బుధవారం ఆందోళన చేపట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని వెలిమినేడులోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో పోశామని.. పది రోజుల క్రితం కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రారంభించారని.. ఇప్పటి వరకు ఒక్క బస్తా కూడా ఇక్కడి నుంచి తరలించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం రైతులంతా కలిసి ధాన్యాన్ని ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేందుకు ప్రయత్నం చేయడంతో అధికారులు, ప్రజాప్రతినిధులు అడ్డుకున్నారు. దీంతో ధాన్యం ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతువేదికకు తాళం వేసి, కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ విజయ్‌కుమార్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులతో మాట్లాడి ధాన్యం వెంటనే కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అన్నదాత రైతు సేవా సమితి అధ్యక్షుడు సుర్కంటి మోహన్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
ఫ కొనుగోలు చేయడం లేదని రైతుల ఆవేదన
ఫ ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునేందుకు రైతుల ప్రయత్నం


