ధాన్యం క్వింటాకు రూ.3500 చెల్లిస్తాం | - | Sakshi
Sakshi News home page

ధాన్యం క్వింటాకు రూ.3500 చెల్లిస్తాం

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

మిర్యాలగూడ : సన్న ధాన్యం క్వింటాకు రూ.3500 తగ్గకుండా చెల్లించి కొనుగోలు చేస్తామని రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కర్నాటి రమేష్‌ అన్నారు. ధాన్యం ధరలు తగ్గించి కొనుగోలు చేస్తున్నారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి మంగళవారం పట్టణంలోని తన క్యాంప్‌ కార్యాలయంలో రైస్‌ మిల్లర్స్‌తో సమావేశమయ్యారు. రైతులకు నష్టం కలుగకుండా క్వింటా ధాన్యానికి రూ.3500 తగ్గకుండా చెల్లించాలని ఆయన మిల్లర్లకు సూచించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో రమేష్‌ మాట్లాడుతూ మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతి రైస్‌ మిల్లులో ధాన్యాన్ని క్వింటాకు రూ.3500 తగ్గకుండా కొనుగోలు చేస్తామని, ధాన్యం నాణ్యత బాగుంటే రూ.3500 కంటే ఎక్కువ ధర చెల్లిస్తామన్నారు. నిర్ణయించిన ధర కంటే తక్కువకు ఎట్టి పరిస్థితుల్లో ధాన్యం కొనుగోలు చేయమని రైతులకు హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని రైస్‌ మిల్లులో ఒకే విధమైన ధర అమలు చేస్తామని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా కొనుగోళ్లు చేపడ్తామని అన్నారు. సమావేశంలో రైస్‌ మిల్లర్స్‌ వెంకటమరణచౌదరి, గందె రాము, గోళ్ల రామశేఖర్‌, గంట సంతోష్‌రెడ్డి, గుడిపాటి శ్రీనివాస్‌, బండారు కుశలయ్య, రేపాల అంతయ్య, జెయిని మురళి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement