రింగ్‌ మాస్టర్‌! | - | Sakshi
Sakshi News home page

రింగ్‌ మాస్టర్‌!

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

కారుణ్య నియామకంలోనూ

కీలక పాత్ర?

దీపావళి సందడి
వైద్యారోగ్య శాఖలో
అతని కనుసన్నల్లోనే ప్రతి సెక్షన్‌లో లావాదేవీలు

దీపావళి సందర్భంగా శనివారం సాయంత్రం నల్లగొండలో పూలు, ప్రమిదలు కొనుగోలు చేస్తున్న ప్రజలు

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో ఓ ఉద్యోగి వ్యవహారశైలి చర్చనీయాంశంగా మారింది. కార్యాలయంలో ఏ పని కావాలన్నా ఆ ఉద్యోగిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం సాగుతోంది. ఫైళ్ల కదలిక నుంచి వివిధ సెక్షన్లలో జరిగే వ్యవహారాలు అతడి కనుసన్నల్లోనే సాగుతున్నాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అతని పోస్టింగ్‌ ఒక సెక్షన్‌లో ఉన్నా.. విధులు మాత్రం మరోచోట నిర్వర్తిస్తున్నాడు. అక్కడి నుంచి తొలగించినప్పటికీ తిరిగి కొనసాగించాలంటూ ఓ ముఖ్య నేత నుంచి ఒత్తిడి రావడంతో జిల్లా అధికారి సైతం మిన్నకుండి పోయారనే చర్చ సాగుతోంది. ఇప్పుడు కారుణ్య నియామకం అక్రమాల నేపథ్యంలో అతను సస్పెండ్‌ కాకుండా చూడాలంటూ తీవ్ర ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది.

లావాదేవీలన్నీ ఆయన కనుసన్నల్లోనే..

జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో వివిధ సెక్షన్లకు సంబంధించిన పనుల కోసం వచ్చే వారంతా అతన్ని కలిస్తేనే పనులు అవుతాయని తెలుస్తోంది. ముఖ్యంగా ప్రైవేట్‌ ఆసుపత్రుల నుంచి వసూళ్ల పర్వంలో అతనే క్రియాశీలంగా వ్యహరిస్తారన్న ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు గతంలో శాలిగౌ రారం, కట్టంగూర్‌, నార్కట్‌పల్లి పీహెచ్‌సీల పరిధిలో రెండో ఏఎన్‌ఎంలను రెగ్యులరైజ్‌ చేయిస్తామంటూ పెద్ద ఎత్తున వసూళ్లు చేసిన వ్యవహారంలో సదరు ఉద్యోగే కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.

మరొకరిని నియమించినా పెత్తనం అతనిదే..

డీఎంహెచ్‌వోగా పుట్ల శ్రీనివాస్‌ పని చేసిన సమయంలో సదరు ఉద్యోగి ఎప్పుడూ డీఎంహెచ్‌వోకు అందుబాటులో ఉండే కీలక విభాగంలో పని చేశాడు. డీఎంహెచ్‌వో మారిన తరువాత అతన్ని అక్కడి నుంచి తొలగించి మరో సెక్షన్‌కు మార్చారు. మరో ఉద్యోగిని డీఎంహెచ్‌వోకు అందుబాటులో ఉండే సెక్షన్‌లో వేశారు. దీంతో జిల్లాలో కీలకంగా వ్యవహరించే ఓ ముఖ్యనేతతో ఫోన్‌ చేయించి డీఎంహెచ్‌వోపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఒక సెక్షన్‌లో జూనియర్‌ అసిస్టెంట్‌గా పని చేయాల్సిన అతను ఎప్పుడూ డీఎంహెచ్‌వోకు అందుబాటులో ఉండే కీలక పనుల్లో అనధికారికంగా కొనసాగుతూ వచ్చారు.

ఫ పోస్టింగ్‌ ఒకచోట..

విధులు మరోచోట

ఫ ముఖ్యనేత ఒత్తిడితో డీఎంహెచ్‌వో పేషీలోనే కొనసాగింపు

ఫ కారుణ్య నియామకంలోనూ తెరవెనుక ఉన్నది అతనేనని ప్రచారం

ఫ సస్పెండ్‌ చేయొద్దంటూ అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు?

ఇటీవల వెలుగులోకి వచ్చిన తప్పుడు మరణ ధ్రువీకరణ పత్రం, దాని ఆధారంగా జరిగిన కారుణ్య నియామకం వ్యవహారంలోనూ సదరు ఉద్యోగి తెరవెనుక కీలకంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఉద్యోగులకు షోకాజ్‌ నోటీసులు, ఛార్జ్‌ మెమోలు జారీ కాగా, మెడికల్‌ ఆఫీసర్‌ సూర్యశిల్పను సస్పెండ్‌ చేశారు. మరికొందరిని బదిలీ చేశారు. రూ.25 లక్షల మేర డీల్‌ కుదిరిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ వ్యవహారంలో తెరవెనుక ఎవరెవరు ఉన్నారన్నది తేలాల్సి ఉంది. అయితే ఈ వ్యవహారంలో కీలకంగా ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న సదరు ఉద్యోగిపై మాత్రం చర్యలు తీసుకోకుండా కాపాడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అతన్ని సస్పెండ్‌ చేయవద్దంటూ అధికార పార్టీకి చెందిన కొందరు నేతలు జిల్లా అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement