పట్టభద్రుల ఓటరు నమోదుకు భారీ స్పందన | - | Sakshi
Sakshi News home page

పట్టభద్రుల ఓటరు నమోదుకు భారీ స్పందన

Nov 8 2026 5:23 AM | Updated on Nov 8 2026 5:23 AM

నల్లగొండ : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదుకు ఈసారి భారీ స్పందన లభిస్తోంది. గతంతో పోలిస్తే దరఖాస్తులు గణనీయంగా పెరిగాయి. నవంబర్‌ 6వ తేదీతో దరఖాస్తుల షెడ్యూల్‌ గడువు ముగిసినప్పటికీ, ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల దాఖ లుకు చివరి తేదీ వరకు ఓటరు నమోదుకు అవకాశం ఉండటంతో దరఖాస్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. నవంబర్‌ 7వ తేదీ మధ్యాహ్నం 2.33 గంటల నాటికి అందిన లెక్కల ప్రకారం నల్లగొండ–ఖమ్మం–వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో 6,70,367 దరఖాస్తులు అందాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 2,38,304 దరఖాస్తులు వచ్చాయి.

నల్లగొండ జిల్లాలో అత్యధికం..

● జిల్లాల వారీగా పరిశీలిస్తే నల్లగొండ జిల్లా దరఖాస్తుల నమోదులో ముందంజలో ఉంది. జిల్లాలోని 33 మండలాల పరిధిలో 1,14,525 దరఖాస్తులు అందాయి. వీటిలో 1,14,478 ఆన్‌లైన్‌ ద్వారా, 47 ఆఫ్‌లైన్‌ ద్వారా వచ్చాయి. ఇప్పటివరకు 59,163 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఆమోదం పొందాయి. మరో 52,810 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. నియోజకవర్గంలోని ఇతర జిల్లాలతో పోలిస్తే నల్లగొండలోనే అత్యధిక దరఖాస్తులు నమోదవడం విశేషం.

● సూర్యాపేట జిల్లాలో 73,990 దరఖాస్తులు రాగా, వీటిలో 73,935 ఆన్‌లైన్‌, 55 ఆఫ్‌లైన్‌లో వచ్చాయి. ఇప్పటివరకు 24,194 దరఖాస్తులు ఆమోదించగా, 1,324 తిరస్కరించారు. మరో 48,471 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి...

● యాదాద్రి భువనగిరి జిల్లాలో 49,789 దరఖాస్తులు రాగా, 49,770 ఆన్‌లైన్‌, 19 ఆఫ్‌లైన్‌లో వచ్చాయి. ఇప్పటివరకు 13,440 దరఖాస్తులు ఆమోదించగా, 711 తిరస్కరించారు. మరో 35,638 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఫ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 2,38,304 దరఖాస్తులు

ఫ నామినేషన్ల చివరి వరకు ఓటరు నమోదుకు అవకాశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement