నల్లగొండ టూటౌన్ : ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్) నిర్వహణ అధ్వానంగా మారిందని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి విమర్శించారు. శనివారం జిల్లా కేంద్రంలోని జీజీహెచ్‌లోని వివిధ విభాగాలు, వార్డులను పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో కలిసి ఆయన పరిశీలించారు. వైద్య సేవలపై రోగులతో మాట్లాడి ఆరా తీశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎక్స్‌రే విభాగానికి తాళం వేశారని, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని, చిన్నారులకు కనీస వసతులు లేకపోవడం దారుణమన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రూ.35 కోట్లతో క్రిటికల్ కేర్ విభాగం నిర్మించి, 50 ఐసీయూ పడకలు, 25 డయాలసిస్ పడకలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందించగా.. ప్రస్తుతం అవి నిరుపయోగంగా మారడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ మాజీ చైర్మన్ చీర పంకజ్ యాదవ్, పార్టీ పట్టణ అధ్యక్షుడు బొనగిరి దేవేందర్, సింగం రాంమోహన్, అభిమన్యు శ్రీనివాస్, దోటి శ్రీనివాస్, మారగోని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, రత్నగిరి శ్రీనివాస్, ప్రవీణ్‌రెడ్డి, దీప్లా, దొడ్డి రమేష్, గోపగాని రాజశేఖర్, రావుల శ్రీనివాస్‌రెడ్డి, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


