రామగిరి (నల్లగొండ) : నల్లగొండ మండలం మేళ్ల దుప్పలపల్లి గ్రామ పరిధిలోని రావి కుంటలో తవ్వకాలపై రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు శనివారం క్షేత్రస్థాయి పరిశీలన జరిపారు. ఇరిగేషన్ ఏఈ ఆధ్వర్యంలో సర్వేయర్ రావి కుంట సరిహద్దులను క్షుణ్ణంగా సర్వే చేశారు. రావి కుంట పరిధిని, ఎఫ్టీఎల్ ప్రాంతాలను తనిఖీ చేశారు. సర్వేయర్‌తో కలిసి భూముల హద్దులను, మట్టి తవ్వకాలు జరిపిన ప్రదేశాలను పరిశీలించి సమగ్ర వివరాలు సేకరించారు. ఇరిగేషన్ శాఖ నుంచి ముందస్తు అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టి తవ్వి అక్రమాలకు పాల్పడిన వారికి ఇప్పటికే నోటీసులు జారీ చేశామని అధికారులు స్పష్టం చేశారు.
రైతులకు సరిపడా విత్తనాలు అందించాలి
ఫ టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
చందంపేట : ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో రైతాంగాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ రక్షణ సమితి (టీఆర్ఎస్) రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. శనివారం డిండి నుంచి దేవరకొండకు వెళ్తుండగా మార్గమధ్యలో చందంపేట మండలం పోలేపల్లి రైతు వేదిక వద్ద ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రైతులకు సబ్సిడీపై అందజేస్తున్న వేరుశనగ విత్తనాల పంపిణీ చేస్తుండగా ఆమె పరిశీలించారు. విత్తనాలు ఏ విధంగా అందజేస్తున్నారు, తదితర వివరాలను రైతులకు అడిగి తెలుసుకున్నారు. రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్న ఆమె వెంటనే కలెక్టర్‌కు ఫోన్ చేసి రైతులకు సరిపడా విత్తనాలను అందుబాటులో ఉంచాలని కోరారు.


