వేధిస్తే.. వదలిపెట్టం! | - | Sakshi
Sakshi News home page

వేధిస్తే.. వదలిపెట్టం!

Nov 4 2026 1:56 AM | Updated on Nov 4 2026 1:56 AM

మౌనం వీడి ఫిర్యాదు చేయండి.. 492 సార్లు హాట్‌స్పాట్ల సందర్శన..

మహిళలు, బాలికల భద్రతకు జిల్లా పోలీస్‌ శాఖ ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని ఎస్పీ శరత్‌ చంద్ర పవార్‌ తెలిపారు. వేధింపులను మౌనంగా భరించకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రారంభంలోనే ఫిర్యాదు చేస్తే సమస్యను సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. మహిళల భద్రతకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఫిర్యాదు చేయాలనుకునే వారు

నల్లగొండ : మహిళలు, బాలికలను వేధిస్తే ఇక తప్పించుకోవడం కష్టమే. ఈవ్‌టీజింగ్‌, అసభ్య ప్రవర్తన, లైంగిక వేధింపులకు అడ్డుకట్ట వేసేందుకు నల్లగొండ జిల్లా పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలోని షీ టీమ్స్‌ నిరంతరం నిఘా కొనసాగిస్తున్నాయి. మహిళల భద్రతే లక్ష్యంగా బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, కళాశాలలు, మార్కెట్లు, షాపింగ్‌ మాల్స్‌ వంటి రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేపడుతున్నాయి. అక్టోబర్‌ నెలలో షీ టీమ్స్‌ పనితీరు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. నెల రోజుల్లోనే వేధింపులకు పాల్పడుతున్న 38 మందిని షీటీమ్‌ బృందాలు పట్టుకున్నాయి. మహిళల నుంచి 14 ఫిర్యాదులు స్వీకరించి మూడు పెట్టీ కేసులు నమోదు చేశాయి.

జిల్లాలో నల్లగొండ, మిర్యాలగూడ కేంద్రాలుగా రెండు షీ టీమ్స్‌ పనిచేస్తున్నాయి. వేధింపులు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తున్నాయి. అక్టోబర్‌లో హాట్‌స్పాట్‌ ప్రాంతాలను 492 సార్లు సందర్శించి పరిస్థితులను పర్యవేక్షించాయి. అనుమానాస్పదంగా వ్యవహరించే వ్యక్తులపై నిఘా పెట్టి వేధింపులకు పాల్పడుతున్న వారిని గుర్తించాయి. మహిళలు, విద్యార్థినులకు భద్రతపై అవగాహన కల్పించేందుకు గత నెలలో 57 కార్యక్రమాలు నిర్వహించాయి. 49 మందికి కౌన్సెలింగ్‌ ఇచ్చాయి. వేధింపులకు పాల్పడితే ఎదురయ్యే చట్టపరమైన పరిణామాలను వివరించడంతోపాటు మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నాయి.

ఫిర్యాదుకు ఎన్నో మార్గాలు..

బాధిత మహిళలు ఫిర్యాదు చేసేందుకు పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా డయల్‌ 112, వాట్సాప్‌, పోలీస్‌ శాఖ అందించిన క్యూ ఆర్‌ కోడ్‌ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామని పోలీసులు భరోసా ఇస్తున్నారు. మహిళలు, యువతులు ప్రయాణ సమయాల్లో తెలంగాణ పోలీస్‌ శాఖ అందుబాటులోకి తెచ్చిన టీ–సేఫ్‌ యాప్‌ను వినియోగించుకోవాలని సూచిస్తున్నారు.

సోషల్‌ మీడియాలో అప్రమత్తంగా ఉండాలి..

సోషల్‌ మీడియా ద్వారా పరిచయాలు పెంచుకొని ఫొటోలు సేకరించడం, మార్ఫింగ్‌ చేసి బ్లాక్‌మెయిల్‌ చేయడం వంటి ఘటనలపై అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తెలియని వ్యక్తుల ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌లను అంగీకరించవద్దని, వ్యక్తిగత ఫొటోలు, వివరాలను షేర్‌ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

మహిళలు, విద్యార్థినులకు అండగా షీ టీమ్స్‌

ఫ అక్టోబర్‌లో 38 మంది పోకిరీల పట్టివేత

ఫ 14 ఫిర్యాదులు.. 3 కేసుల నమోదు

ఫ వేధింపులపై మౌనం వీడి ఫిర్యాదు చేయాలని పోలీస్‌శాఖ సూచన

జిల్లా షీ టీమ్‌: 8712670235,ఇన్‌చార్జి కె.మంజుల, ఇన్‌స్పెక్టర్‌ : 8712670143,

నల్లగొండ షీ టీమ్‌: 8712576870, మిర్యాలగూడ షీ టీమ్‌: 8712582094

నంబర్లను సంప్రదించాలని

పేర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement