రామగిరి (నల్లగొండ) : నల్లగొండలోన ఎన్జీ కళాశాలలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ సెంటర్ సెమినార్ హాల్లో ఎస్కేఎస్ఎస్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన మెగాజాబ్ మేళాకు విశేష స్పందన వచ్చింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వందలాది మంది నిరుద్యోగులు తరలివచ్చారు. నల్లగొండ డీఎస్పీ శివరాంరెడ్డి జాబ్‌మేళాను ప్రారంభించి మాట్లాడారు. కార్యక్రమంలో ఎన్జీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఉపేందర్, పొట్టిపాక నాగరాజు, టూ టౌన్ ఎస్ఐ సైదాబాబు, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ రీజినల్ కోఆర్డినేటర్ బొజ్జ అనిల్‌కుమార్, ఫాక్స్‌కాన్ హెచ్ఆర్ మేనేజర్ శ్రీనివాస్, ఎస్కెఎస్ఎస్ మేనేజర్ మూర్తి, ప్రతినిధులు తరాల నరేష్, తోగిటి అనుదీప్, నల్ల మధు, కట్ట హరిబాబు, నాంపల్లి మధు, తోనుకునూరి సన్నీ, కొవూరు అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు.


