మర్రిగూడ : మండలంలోని 15 మంది పంచాయతీ కార్యదర్శులు మూకుమ్మడిగా సెలవు కోరుతూ ఎంపీడీఓ జి.చినమునయ్య, ఎంపీవో బి.రవికుమార్‌కు మంగళశారం వినతిపత్రం అందించారు. పనిభారం పెంచడంతోపాటు పనుల విషయంలో వేధింపులకు గురిచేయడం వల్ల విధులు నిర్వహించలేకపోతున్నామని తెలిపారు. మండలంలోని ఖుదాబాక్షపల్లి కార్యదర్శి ప్రసన్నబాబు మాట్లాడుతూ ఓ పార్టీ నాయకుడి ప్రోద్భలంతోనే ఎంపీవో కలెక్టర్‌కు, డీపీవోకు తప్పుడు నివేదికలు అందించి తనను సస్పెన్షన్ చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంజీయూ హాస్టల్స్ డైరెక్టర్‌గా లక్ష్మీప్రభ
నల్లగొండ టూటౌన్ : నల్లగొండలోని ఎంజీ యూనివర్సిటీ హాస్టల్స్ డైరెక్టర్‌గా మేనేజ్‌మెంట్ విభాగం అధ్యాపకురాలు జి.లక్ష్మీప్రభను నియమిస్తూ వీసీ ఖాజా అల్తాఫ్ హుస్సేన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు రిజిస్ట్రార్ కొప్పుల అంజిరెడ్డి లక్ష్మిప్రభకు నియామక ఉత్తర్వులు అందజేశారు.
తమ్మడపల్లిలో భూముల రీ సర్వే పరిశీలన
మర్రిగూడ : మండలంలోని తమ్మడపల్లి గ్రామంలో భూముల రీసర్వేను డిప్యూటీ కలెక్టర్ (ట్రెయినీ) శ్రీకాంత్‌రెడ్డి మంగళవారం పరిశీలించారు. గ్రామంలో భూ రీసర్వే పురోగతిపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. సర్వే ప్రక్రియ వేగవంతంగా, పారదర్శకంగా జరగాలని సూచించారు. భూముల సరిహద్దుల నిర్ధారణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, రైతులకు సంపూర్ణ అవగాహన కల్పిస్తూ సర్వే పూర్తి చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయిలో రీ సర్వే రికార్డుల నమోదుపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ జక్కర్తి శ్రీనివాసులు, ఆర్‌ఐ పాండురంగారెడ్డి, జీపీఓ గిరి, సర్వేయర్ రవి తదితరులు పాల్గొన్నారు.
వినియోగదారుల సమస్యలు పరిష్కరించాలి
నల్లగొండ : విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరించాలని సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఎస్‌ఈ) శ్రీనివాసులు అధికారులను ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల దినో త్సవం సందర్భంగా మంగళవారం నల్లగొండ విద్యుత్ సర్కిల్ కార్యాలయ ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ కేటగిరీలకు చెందిన విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. మొత్తం 10 ఫిర్యాదులు నమోదు కాగా, వీటిలో 9 విద్యుత్ బిల్లుల సవరణకు (బిల్ రివిజన్) సంబంధించినవి, కొటి విద్యుత్ తీగలు వేలాడుతుండటానికి (లూజ్ లైన్స్) సంబంధించినవి ఉన్నాయి. వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి, నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని ఎస్‌ఈ ఆదేశించారు. విద్యుత్ వినియోగదారుల సమస్యలను ప్రాధాన్యతతో పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో డీఈలు ఎం.వినోద్‌రెడ్డి, సీహెచ్.విద్యాసాగర్, ఏడీఈలు ఎం.వేణుగోపాలాచార్యులు, శ్రీను, ఏఈలు అలిబాబా, సురేష్, ఎండీ షరీఫ్, చంద్రశేఖర్, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


