నల్లగొండ : ఓటు చోరీకి నిరసనగా నవంబర్ 1న ఢిల్లీలో నిర్వహించే ర్యాలీకి కాంగ్రెస్ శ్రేణులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం నల్లగొండలోని యాదవ సంఘ భవన్‌లో డీసీసీ అధ్యక్షుడు పున్న కై లాష్‌నేత అధ్యక్షతన నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ కుట్రపూరితంగా వ్యవహరించి.. ఎస్‌ఐఆర్ ప్రక్రియ పేరుతో దేశవ్యాప్తంగా 13 కోట్ల మంది ఓటర్లను తొలగించారని ఆరోపించారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఆదివాసీ వర్గాలకు ఆశించిన ప్రయోజనాలు దక్కలేదన్నారు. ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరగడంతోనే ఓటు చోరీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎస్‌ఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని డిమాండ్ చేశారు. ‘ఓటును కాపాడుకుందాం.. దేశాన్ని రక్షించుకుందాం’ అనే నినాదంతో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో ఇండియా కూటమి ఆధ్వర్యంలో నిర్వహించే మహా ర్యాలీకి జిల్లా నుంచి 2 వేల మంది తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో నాయకులు పరమేశ్, బోడ స్వామి, చామల శ్రీనివాస్, అంబటి సోమయ్య, చిలుకూరి బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐసీసీ పరిశీలకుడు రాంభూపాల్‌రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు వినోద్‌రెడ్డి


