అడుక్కుతింటుంటే అధికారం రాదు | - | Sakshi
Sakshi News home page

అడుక్కుతింటుంటే అధికారం రాదు

Oct 27 2026 2:02 AM | Updated on Oct 27 2026 2:02 AM

ఫ మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు

నల్లగొండ టౌన్‌ : అగ్రవర్ణాల వద్ద అడుక్కు తింటుంటే అధికారం రాదని, కడుపు నిండదని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహులు అన్నారు. సోమవారం నల్లగొండలోని అంబేద్కర్‌ భవన్‌లో జరిగిన మాదిగల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. అధికారం దక్కాలంటే ఐక్య పోరాటమే ఏకై క మార్గమని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది మాదిగలు అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ఎన్నో అవమానాలు పడుతూ అధికారానికి దూరంగా ఉండి కుల పీడనకు గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడినా మాదిగలకు ఒరిగిందేమీ లేదని, పార్టీలను పక్కనపెట్టి మాదిగలు ఏకం కావాలని పిలపునిచ్చారు. త్వరలో మాదిగల మహాశక్తి ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్‌ కుమార్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో దున్న యాదగిరి, తుల షణ్ముఖ, పెరిక కరణ్‌ జయరాజు, శ్రవణ్‌, రమేష్‌, నవీన్‌, కొప్పోలు అశోక్‌ , మాచర్ల సైదులు, పెరిక అంజయ్య, కత్తుల సన్నీ, చింత శివరామకృష్ణ, మామిడి బాలయ్య, మామిడి ప్రమీల, కొప్పోలు విమలమ్మ పాల్గొన్నారు.

పోలీస్‌ గ్రీవెన్స్‌లో వినతుల స్వీకరణ

నల్లగొండ : జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం పోలీస్‌ గ్రీవెన్స్‌డే సందర్భంగా బాధితుల నుంచి ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 45 మంది బాధితులు తమ సమస్యలను ఎస్పీకి తెలియజేశారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, ఆస్తి తగాదాలు, మోసాలకు సంబంధించిన ఫిర్యాదులపై బాధితులు వినతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు న్యాయం జరిగే విధంగా ప్రతి ఫిర్యాదును సమగ్రంగా విచారించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీస్‌ అధికారులకు ఫోన్‌ ద్వారా సూచించారు.

31న టీపీఎఫ్‌

ఆవిర్భావ సభ

కట్టంగూర్‌: కొత్తగూడెంలో ఈ నెల 31న నిర్వహించనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్‌ (టీపీఎఫ్‌) 17వ ఆవిర్భావ సభను జయప్రదం చేయాలని టీపీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి యాదయ్య పిలుపునిచ్చారు. సోమవారం కట్టంగూర్‌లో ఆవిర్భావ సభ పోస్టర్లను ఆ సంఘం నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో టీపీఎఫ్‌ జిల్లా నాయకులు గండెబోయిన బాలకృష్ణ, రసాల బాలస్వామి, ఆటో కార్మిక సంఘం నాయకుడు మేడి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement